Site icon HashtagU Telugu

CM KCR : మునుగోడులో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము – కేసీఆర్

Reasons Behind Defeat of KCR

Reasons Behind Defeat of KCR

తెలంగాణ ఎన్నికల (Telangana Elections) సమయం దగ్గర పడుతుండడం తో గులాబీ బాస్ (KCR) ఎక్కడ కూడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. గత కొద్దీ రోజులుగా ప్రజాఆశీర్వాద సభ (Praja Ashirvada Sabha)ల పేరుతో జిల్లాల పర్యటన చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే పలు జిల్లాలో భారీ సభలు నిర్వహించిన కేసీఆర్..నేడు వనపర్తి, మునుగోడు లలో పర్యటించారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ , బిజెపి పార్టీల ఫై విమర్శల వర్షం కురిపించారు.

ఇంతకాలం తాను పోరాటం చేశానని ..ఇకపై పోరాటం చేయాల్సింది ప్రజలేనని కేసీఆర్ అన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం ఎవరో వచ్చి చెప్పే మాటలు నమ్మి మోసపోవద్దని..నమ్మి ఓటేస్తే పోరాడి సాధించుకున్న తెలంగాణను కుక్కలు చింపిన విస్తరి చేస్తారని హెచ్చరించారు. మునుగోడు కోసం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అంతకుముందున్న కాంగ్రెస్‌ 50-60 సంవత్సరాలు పరిపాలించినా ఇక్కడ నడుములు వంగిపోయేదాకా.. చచ్చిపోయేదాక చూశారే తప్పా ఫ్లోరైడ్‌ నివారణ కోసం కృషి చేయలేదు. అటల్‌ బిహారి వాజ్‌పేయ్‌ ప్రధానిగా ఉన్న సమయంలో.. ఇక్కడి ఉద్యమకారులు స్వామి అనే పిల్లవాడిని ప్రధాని టేబుల్‌పై పడుకొబెట్టినా.. దానికి నివారణ దొరకలేదు.

కానీ బీఆర్‌ఎస్‌ పార్టీ వచ్చాకనే ఫ్లోరైడ్‌ నీళ్ల గోస ఏ విధంగా పోయిందో మీ అందరికీ తెలుసు. అనేక కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఎవరూ లేరు. పిడికెడు మందిమే ఉన్నాం. ప్రభాకర్‌రెడ్డి ఆ నాటి నుంచి ఈ నాటి వరకు ఉద్యమంలో ఉన్నారు. ఆ నాటి నుంచి ఈనాటి వరకు ఉద్యమంలో నా వెంట ఉన్నారు. మడమ తిప్పకుండా పోరాటం చేస్తున్నారు. ఆ నాడు ఎక్కడెక్కడున్నోళ్లు.. ఎవల బూట్లు మూసినోళ్లు.. ఇవాళ ఛాలెంజ్‌లు చేస్తున్నారని..అలాంటి వారికీ బుద్ది రావాలంటే కారు గుర్తుకు ఓటేసి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.

వనపర్తిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ..వలసల వనపర్తిని వరిపంటల వనపర్తిని చేసిన మొనగాడు చేసింది ఎవరు?.. ఈరోజు లేనిపోని ఉల్టాపల్టా మాట్లేడే చిల్లగాళ్లు ఎవరు? వరిపంటల వనపర్తి చేసినోడు కావాలా? ఎవరు కావాలో తేల్చాల్సింది మీరు.. న్యాయం చెప్పాల్సింది మీరేనని సీఎం కేసీఆర్‌ అన్నారు. అడ్డంపొడువు మాట్లాడే కాంగ్రెస్‌.. అనేళ్లు రాజ్యం చేస్తే.. నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ కన్నా దొడ్డుగా.. ఎత్తుగా ఉన్నోళ్లు చాలామంత్రులు పాలమూరులో ఉన్నారు. ఒక్కడన్నా మెడికల్‌ కాలేజీ జిల్లాకు తీసుకువచ్చారా? పాత మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఐదు మెడికల్‌ కాలేజీలు తీసుకువచ్చిన ఘనులు మా నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌ కాదా? ఇది చరిత్ర కాదా అని మనివి చేస్తున్నా. తెచ్చింది కాకుండా మళ్లీ నాకు పశువైద్య కళాశాల కావాలని నిరంజన్‌రెడ్డి అంటున్నడు. వాస్తం ఇది చాలా సంస్కారం ఉన్నటువంటి.. కల్చలర్‌ ఆడియన్స్‌ ఉన్నటువంటి గొప్ప పట్టణం వనపర్తి అని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

Read Also : Nara Bhuvaneshwari : తాత ఎక్కడ అని దేవాన్ష్ అడుగుతుంటే గుండె తరుక్కుపోతోంది – నారా భువనేశ్వరి