దేశ వ్యాప్తంగా తెలంగాణ ఎన్నికల (Telangana Elections) పైనే అందరి ఫోకస్. రాజకీయ నేతల దగ్గరి నుండి సామాన్య ప్రజల వరకు ప్రతి ఒక్కరు తెలంగాణ ఎన్నికల పరిస్థితి ఎలా ఉంది..? ఏ ఏ పార్టీలు ఎలా ప్రచారం చేస్తున్నాయి..? ప్రజలు ఎవరికీ మద్దతు తెలుపుతున్నారు..? సర్వేలు ఏమంటున్నాయి..? బిఆర్ఎస్ – కాంగ్రెస్ పార్టీల హామీలు ఇలా ఉన్నాయి..? ఎవరి హామీలు బాగున్నాయి..? ఎవరి హామీలు ప్రజలకు మేలు జరిగేలా ఉన్నాయి..? రేవంత్ – కేసీఆర్ ల మాటల తూటాలు ఎలా ఉన్నాయి..? ఇలా ప్రతి ఒక్కరు పలు ప్రశ్నలు గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారట.
We’re now on WhatsApp. Click to Join.
ముఖ్యంగా సీఎం కేసీఆర్ (CM KCR), టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి కేటీఆర్ (KTR) గురించి గూగుల్‌లో ఎక్కువగా సెర్చ్ చేస్తున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఇక బీజేపీ నేతలైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్‌ల గురించి మాత్రం పెద్దగా గూగుల్‌లో శోధన చేయడం లేదట..అసలు బిజెపి గురించి అస్సలు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఆన్‌లైన్ ట్రెండింగ్ అనేది ఆ వ్యక్తి పాపులారిటీని ప్రత్యక్షంగా సూచించడమే కాకుండా.. ప్రస్తుత పరిస్థితులనూ కూడా పరోక్షంగా సూచినస్తాయని ఎన్నికల వ్యూహకర్త, డిజిటల్ మార్కెటర్ రామ్ సుభాష్ యాదవ్ చెబుతున్నారు. సాధారణంగా రాజకీయాల కంటే క్రికెట్, సినిమాలు, ఫెస్టివల్స్ లాంటి వాటిని గూగుల్‌లో ఎక్కువ సెర్చ్ చేస్తారని.. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీలు, వాటి మేనిఫెస్టోలు, అభ్యర్థుల జాబితాలను నెటీజన్లు ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారని తెలిపారు.
Read Also : Chandrababu : మధ్యతరగతి ప్రజలంతా బాబునే కోరుకుంటున్నారు..ఇదే సాక్ష్యం