Telangana: 13 నెలల తర్వాత రాజ్‌ భవన్‌లో అడుగు పెట్టిన సీఎం కేసీఆర్

ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ వచ్చి సంవత్సరం దాటింది. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ గవర్నర్ కి అస్సలు పడటం లేదు.

Published By: HashtagU Telugu Desk
Telangana

New Web Story Copy (8)

Telangana: ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య గ్యాప్ వచ్చి సంవత్సరం దాటింది. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ గవర్నర్ కి అస్సలు పడటం లేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య మాటల యుద్ధం నడిచింది. తెలంగాణ ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతూ కేంద్రం వద్ద ఆమె ప్రస్తావించడం జరిగింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ పై విమర్శలు చేస్తుంది. ఇలా దాదాపుగా సంవత్సకాలం నడించింది. ఈ గొడవల నేపథ్యంలో సీఎం కేసీఆర్ రాజ్ భవన్ లో అడుగుపెట్టక 13 నెలలు అవుతుంది. అయితే తాజాగా 13 నెలల తరువాత సీఎం కేసీఆర్ ఈ రోజు రాజ్ భవన్ లో అడుగుపెట్టారు.

తెలంగాణ హైకోర్టు నూతన ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ అలోక్‌ అరాధే ఈ ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్ భవన్ లో 11 గంటలకు జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ ఆయన చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. గతేడాది హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. మళ్లీ 13 నెలల తరువాత సీఎం కేసీఆర్ రాజ్‌ భవన్‌ కు వచ్చి గవర్నర్‌‌ తమిళిసైతో వేదిక పంచుకున్నారు.

Also Read: Madhya Pradesh: పొరపాటున తగిలితే దళితుడిపై మానవ మూత్రవిసర్జనతో దాడి

  Last Updated: 23 Jul 2023, 12:58 PM IST