CM KCR: కేంద్రంపై కేసీఆర్ పోరుబాట

తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాసంగిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాసంగిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుందని కేసీఆర్ తెలిపారు. వార్షాకాలం పంటను కేంద్రం కొనకపోతే ధాన్యాన్ని రాష్ట్రమే కొని కిషన్ రెడ్డి ఇంట్లో, బీజేపీ ఆఫీసులో, మోదీ ఇంట్లో పోస్తామని కేసీఆర్ తెలిపారు. కేబినెట్ తర్వాత జరిగిన ప్రెస్ మీట్లో కేసీఆర్ మాట్లాడిన విషయాలు మీకోసం.

1. కేంద్రం సామాజిక బాధ్యతను మర్చిపోయి పేదల వ్యతిరేక విధానాలను అవలంబిస్తోంది. దేశంలో ధాన్యాన్ని సేకరించే బాధ్యత కేంద్రానిదే. ఇంత నీచమైన, దిగజారిపోయిన కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటివరకు చూడలేదు. భవిషత్తులో కూడా చూడం.

2. కేంద్రం చిల్లరకొట్టు వ్యవహారంలాగా మాట్లాడుతుంది. కేంద్రం ఏది సూటిగా చెప్పదు. ధాన్యం విషయంలో కేంద్రం మెడమీద కత్తిపెట్టి రాష్ట్ర ప్రభుత్వంతో లెటర్ రాయించుకుంది.

Also Read:“తెలంగాణ‌” త‌ర‌హా ఉద్య‌మానికి కేసీఆర్ స్కెచ్

3. రాష్ట్రం వచ్చాకా, విభజన హామీలు నెరవేర్చకున్నా, ఏపీ సహకరించకున్నా, రాష్ట్రంలోని కొందరు రాజకీయ రాక్షసులు ఇబ్బంది పెట్టినా ప్రాజెక్టులు కట్టినాం. ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు భీమా ఇస్తున్నాం. తెలంగాణలో ఉన్న పధకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవు.

4. రాష్ట్రంలో కేంద్రమంత్రి ఉంటే రాష్ట్రానికి బాగుంటుంది కానీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం ధాన్యం కొనమని అంటాడు. కిషన్ రెడ్డి రండ కేంద్రమంత్రి.బీజేపీ దిక్కుమాలిన పార్టీ,
రైతు రాబందు పార్టీ.

5. కిషన్ రెడ్డి మంత్రిగా ఉన్న మోదీ ప్రభుత్వమే పెట్రోల్ రేట్లు పెంచింది. కిషన్ రెడ్డి మోదీతో తెలంగాణ ధాన్యాన్ని కొనిపించగలడా? మా రాష్ట్రంలో వరి పండిస్తాం దాన్ని కొంటారా? కొనరా? చెప్పండి అంటే డ్రామాలు చేస్తారా? రాష్ట్ర బీజేపీ నేతలను హీనాతి హీనంగా చూస్తారు.

Also Read: రేవంత్ వేదికపైకి తాను నల్ల చొక్కాతో ఎందుకు వచ్చాడో తెలిపిన కోమటిరెడ్డి

6. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రైతులను అయోమయానికి గురిచేస్తున్నారు. పచ్చి అబద్దాలు మాట్లాడుతున్నారు. లెక్కలన్నీ కేంద్రం మొహంపై కొట్టినాం. రైతులపై ఇలాగేనా వ్యవహరించేది. ఇంత చీప్ గా వ్యవహరిస్తారా? బీజేపీ పాలన కంటే టీఆర్ఎస్ పాలన కొన్ని కోట్లరెట్లు బాగుంది.

7. కేంద్రమంత్రి పీయూష్ గోయల్ సిగ్గులేకుండా మాట్లాడుతాడు. ఇంత సిగ్గుతప్పి ఆయన ఎలా మాట్లాడుతాడో. గ్లోబల్ హాంగర్ ఇండెక్స్ లో ఇండియా బాంగ్లాదేశ్, పాకిస్థాన్ కంటే వెనకబడి ఉంది. సిగ్గుంటే ఇప్పటికైనా కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, పీయూష్ గోయల్ కళ్ళు తెరవాలి.

8. రైతు చట్టాలు మంచివైతే ఎందుకు వెనక్కి తీసుకున్నారు. ఉత్తర భారత రైతులకు క్షమాపణ చెప్పినట్టే, రేపు తెలంగాణ రైతులకు కూడా కేంద్రం క్షమాపణ చెప్పుద్ది. విద్యుత్ సంస్కరణల పేరుతో కేంద్రం రాష్ట్రాల మెడలపై కత్తి పెట్టడం ఏంటి?

9. రైతులు బాగుపడాలంటే బీజేపీ అధికారం నుండి పోవాలి. పనికిమాలిన చట్టాలు తెచ్చేది బీజేపీనే, క్షమాపణ చెప్పేది కూడా బీజేపీనే. దేశాన్ని అప్పులకుప్పగా మార్చింది. దేశ ప్రజలకు మోదీ ఏ రంగంలో అభివృద్ధి చేసాడో చెప్పాలి. బీజేపీ ప్రజలకు మతపిచ్చి లేపి విభజన రాజకీయాలు చేస్తోంది.

10. తెలంగాణాలో రైతులు ఒక్క ఎకరం అమ్మి ప్రకాశం జిల్లాలో నాలుగు ఎకరాలు కొంటున్నారు. ఏడేండ్ల కింద రైతులు ఎలా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారో చూడండి. బీజేపీ పనికిమాలిన రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి అవగాహనా రాహిత్యంతో మాట్లాడుతున్నాడని కేంద్ర మంత్రులే చెప్తున్నారు.

11. యాసంగిలో తెలంగాణాలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. ఢిల్లీకి వెళ్లి విమానఖర్చులు వేస్ట్ అయ్యాయి. వాట్సాప్ యూనివర్సిటీలో బీజేపీ దిక్కుమాలిన ప్రచారాన్ని చేస్తోంది. టీఆర్ఎస్ అబద్దాలు చెప్పలేదు, మోసం చేయలేదు.

12. కిషన్ రెడ్డి మాట్లాడిన విషయాలను వెనక్కి తీసుకోని క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ చేతులో ఉన్నవన్నీ రైతులకి ఇస్తాం. మోదీ చేతిలో ఉన్నవి ఇవ్వట్లేదు దానికి ఏ శిక్ష వేస్తారో వేయండి.

13. బీజేపీని అడుగడుగునా నిలదీస్తాం. బీజేపీ అవలంబిస్తోన్న అన్ని ప్రజావ్యతిరేక విధానాలపై కొట్లాడుతాము. బీజేపీ చంపిన రైతులకు ఇస్తామన్న మూడు లక్షల ఎక్స్ గ్రేషియా డబ్బులు విడుదల చేసాం. త్వరలోనే పంపిణీ చేస్తాం.