తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆరోగ్యం (KCR Health) పట్ల రోజు రోజుకు BRS శ్రేణుల్లో , ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. గత మూడు వారాలుగా ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో ఆయన ఛాతికి ఇన్ఫెక్షన్ వచ్చిందనీ, కొన్ని రోజుల కిందట వైరల్ ఫీవర్, తాజాగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రావడం వల్ల ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆయనకు ట్రీట్‌మెంట్ అందుతోందని కేటీఆర్ (KTR) స్వయంగా తెలిపారు. కేసీఆర్ కోలుకోవడానికి కొంత సమయం పడుతుందని చెప్పడం తో పార్టీ శ్రేణుల్లో ఆందోళన పెరుగుతుంది. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సీఎం కేసీఆర్ వయసు (KCR Age) 69 ఏళ్లు. ఈ వయసులో ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. అందువల్ల వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు ఇన్ఫెక్షన్స్ రావడం సహజం. ఆమధ్య హైదరాబాద్‌లో భారీ వర్షాలు పడడం.. ఆ తర్వాత దోమల సంఖ్య బాగా పెరిగింది. దాంతో తెలంగాణలో వైరల్ ఫీవర్లు ఎక్కువయ్యాయి. సీఎం కేసీఆర్ కూడా వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయనకు ప్రగతి భవన్‌లో యశోద హాస్పటల్ నిపుణులు ట్రీట్మెంట్ చేస్తున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేసీఆర్ అనారోగ్యం బారిన పడడం పార్టీ శ్రేణుల్లో కొంత ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే అభ్యర్థుల ప్రకటన తర్వాత బిఆర్ఎస్ లో అసమ్మతి సెగ ఎక్కువైంది. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలంతా కాంగ్రెస్ బాట పట్టారు. ఎన్నికల సమయం నాటికీ మరికొంతమంది కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం అందుతుంది. ప్రజల్లోనూ రోజు రోజుకు కాంగ్రెస్ ఫై నమ్మకం పెరుగుతుంది..పలు సర్వే లు కూడా ఈసారి కాంగ్రెస్ విజయం ఖాయం అన్నట్లు చెపుతుండడం తో కొంతమంది బిఆర్ఎస్ శ్రేణుల్లో అయోమయంలో పడుతున్నారు. ఇలాంటి కీలక సమయంలో కేసీఆర్ అనారోగ్యానికి గురి కావడం వారిని నిద్ర కూడా పట్టనివ్వడం లేదు.
కేసీఆర్ ఫీవర్ తో బాధపడుతుండడం తో పార్టీ కార్యక్రమాలన్నీ మంత్రి కేటీఆరే చూసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ చేతుల మీదుగా జరగాల్సిన అభివృద్ధి పనులకు కేటీఆర్ హాజరై, వాటికీ శ్రీకారం చుడుతున్నారు. ప్రతి రోజు ఏదోక జిలాల్లో పర్యటిస్తూ పార్టీ కార్యకర్తల్లో , నేతల్లో ఉత్సాహం నింపుతున్నారు. ఇదే క్రమంలో ప్రతిపక్ష పార్టీలు బిఆర్ఎస్ ఫై మాటల దాడిని పెంచాయి. ఎన్నికల్లో బిఆర్ఎస్ ఓడిపోతుందనే భయం తోనే కేసీఆర్ కు జ్వరం వచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.
Read Also : YSRCP : ఏపీకి మేలు జరగాలంటే జగన్ మళ్లీ సీఎం కావాలి – మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్