అసెంబ్లీ ఎన్నికల సమయం నెల రోజుల సమయం కూడా లేకపోవడం తో కాంగ్రెస్ – బిఆర్ఎస్ (BRS_COngress) పార్టీ లు వరుస సభలు , ప్రచారం తో హోరెత్తిస్తున్నాయి. బిఆర్ఎస్ తరుపున సీఎం కేసీఆర్ , మంత్రులు కేటీఆర్ , హరీష్ రావు లతో పాటు నేతలంతా బిజీ బిజీ గా పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటుంటే..ఇటు కాంగ్రెస్ పార్టీ అగ్ర నేతలు రాహుల్ (Rahul) , ప్రియాంక , ఖర్గే లతో పాటు ఇతర రాష్ట్రాల నేతలు సైతం రంగంలోకి దిగి ప్రచారం చేస్తున్నారు. ఈసారి ఎలాగైనా తెలంగాణ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని సన్నాహాలు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక గులాబీ బాస్ కేసీఆర్ (KCR) సైతం ఎక్కడ తగ్గేదెలా అన్నట్లు వరుసగా జిల్లాల పర్యటన చేస్తూ కాంగ్రెస్ , బిజెపి నేతలపై విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఈరోజు సూర్యాపేట(Suryapet) జిల్లా హుజూర్‌నగర్, మిర్యాలగూడ, దేవరకొండలో ప్రచారంలో కేసీఆర్ పాల్గొన్నారు. హుజూర్‌నగర్ () సభలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఫై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఉత్తమ్ గడ్డాలు (Uttam Kumar Reddy Beard), పెంచుకుంటే సరిపోదని..ఆయన గడ్డం గీసుకుంటే ఎంత గీసుకోకపోతే ఎంత.. శపథాలు పనికి రావు పని కావాలని ..నీళ్లు, కరెంట్ కావాలంటే సైదిరెడ్డిని గెలిపించమని పిలుపునిచ్చారు. కారు గుర్తుకు ఓటేసి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ వంటి తోక పార్టీల మాటలు నమ్మి మోసపోవద్దని సూచించారు.
Read Also : Telangana : కొడంగల్‌లోనే గెలవని రేవంత్.. కామారెడ్డిలో గెలుస్తారా అంటూ కేటీఆర్ ఎద్దేవా