Chandra Mohan Demise: చంద్రమోహన్ మృతి పట్ల సీఎం కేసీఆర్, వైస్ జగన్ సంతాపం

టాలీవుడ్ నటుడు, తొలి తరం హీరో చంద్రమోహన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ సంతాపం తెలిపారు .చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వైవిధ్యభరితమైన పాత్రలు,

Published By: HashtagU Telugu Desk
Chandra Mohan Demise

Chandra Mohan Demise

Chandra Mohan Demise: టాలీవుడ్ నటుడు, తొలి తరం హీరో చంద్రమోహన్ మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్ సంతాపం తెలిపారు .చంద్రమోహన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. వైవిధ్యభరితమైన పాత్రలు, విలక్షణమైన నటనతో దశాబ్దాలుగా కోట్లాది మంది ప్రేక్షకులను అలరించారని తెలిపారు. దివంగత నటుడు చంద్రమోహన్ మృతి తెలుగు చిత్రసీమకు తీరని లోటు అని పేర్కొన్నారు.

చంద్రమోహన్ స్ఫూర్తితో తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో నటీ నటులు ఉన్నత స్థాయికి ఎదిగారని కేసీఆర్ చెప్పారు . చంద్రమోహన్ తెలుగుతో పాటు ఇతర భాషల్లో లక్షలాది మంది ప్రజల ప్రేమాభిమానాలను చూరగొన్నారని అభిప్రాయపడ్డారు. చంద్రమోహన్ కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ప్రముఖ దర్శకులు, నిర్మాణ సంస్థల ఆధ్వర్యంలో ఎన్నో సినిమాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ మృతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Also Read: 800 Earthquakes : వణికిపోయిన ఐస్‌లాండ్.. 14 గంటల్లో 800 భూప్రకంపనలు

  Last Updated: 11 Nov 2023, 02:33 PM IST