Site icon HashtagU Telugu

Chinta Mohan : తెలంగాణలో కాంగ్రెస్ 75 స్థానాలతో అధికారం చేపట్టబోతుంది – కేంద్ర మాజీ మంత్రి కామెంట్స్

Chinta Mohan Comments T Con

Chinta Mohan Comments T Con

తెలంగాణ (Telangana) లో కాంగ్రెస్ పార్టీ (Congress Party) భారీ మెజార్టీ తో విజయం సాదించబోతుందని , దాదాపు 75 స్థానాల్లో గెలవబోతుందని ధీమా వ్యక్తం చేసారు కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చింతా మోహన్ (Chinta Mohan). ఏపీ (AP)లో కాంగ్రెస్‌ 10 నుంచి 15 శాతం ఓటు బ్యాంకు పెరిగిందన్నారు మోహన్. తమ పార్టీతో కలసిన వారు తప్పకుండా అధికారంలోకి వస్తారన్నారు. ఓబీసీ రిజర్వేషన్లు కాంగ్రెస్ 2005లో రాజ్యంగ సవరణ ద్వారా చట్టం చేసి 27శాతం రిజర్వేషన్లను ఇచ్చిందని.. 75 సంవత్సరాల్లో ఓబీసీలు రాజకీయంగా ముందుకు వెళ్లలేదని.. ఓబీసీలకు కూడా రాజకీయ రిజర్వేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. టీడీపీ – జనసేన (TDP-Janasena) పొత్తును ఆహ్వానిస్తున్నామని, కాంగ్రెస్‌తో కూడా కలిస్తే తప్పకుండా అధికారంలోకి వస్తారని అన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

అలాగే చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest)ఫై కూడా చింతా మోహన్ స్పందించారు. చంద్రబాబుపై తప్పుడు కేసు నమోదు చేశారని , ఆయన్ను వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని , ఆయన న్యాయస్థానాల్లోనూ రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తుందని చింతామోహన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబును తక్షణం జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ నేత రాహుల్ గాంధీని ఇబ్బంది పెట్టినట్టే ఇప్పుడు చంద్రబాబును ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. తమిళనాడు తరహా రాజకీయాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయన్నారు . ఈ మధ్య కాలంలో కొన్ని వ్యవస్థలో రాజకీయ జోక్యం ఎక్కువగా కనిపిస్తుందన్నారు.

Read Also : Ponnala Joins In BRS : కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరిన పొన్నాల..