Chinta Chiguru Vs Mutton : సమ్మర్‌లో చింత చిగురును తినడానికి జనం బాగా ఇష్టపడతారు. అందుకే ఈ టైంలో చింత చిగురు రేటు భారీ ధరను పలుకుతుంటుంది. ప్రస్తుతం చింత చిగురు రేటు విషయంలో మటన్‌తో పోటీ పడుతోంది. దీని సేల్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. మార్కెట్లో చింత చిగురు లభ్యత తక్కువగా ఉండటంతో రేటును లెక్క చేయకుండా ఆహార ప్రియులు కొనుగోలు చేస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
కిలో చింత చిగురు రేటు ఇప్పుడు ఏకంగా రూ.700 దాకా(Chinta Chiguru Vs Mutton) పలుకుతోంది. ఇంత డబ్బు ఖర్చు పెడితే.. మూడు కిలోల చేపలు, రెండున్నర కిలోల చికెన్, కిలో మటన్ కూడా వస్తుంది. ఈవిషయం తెలిసినా.. ఆహార ప్రియులు చింత చిగురును కొనడానికి వెనుకాడటం లేదు. అందుకే దాని టేస్టు అదిరిపోయేలా ఉంటుంది. వివిధ కాంబినేషన్లలో చింతచిగురు వంటకాలు ఎంతో రుచికరంగా ఉంటాయి. ఆహార ప్రియులు లొట్టలు వేసుకుంటూ వాటిని తినేస్తుంటారు.హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ హోల్‌సేల్, రిటైల్ మార్కెట్‌తో పాటు రైతుబజార్లలో చింత చిగురును విక్రయిస్తున్నారు. గుడిమలాపూర్ రిటైల్ మార్కెట్లో కిలో చింత చిగురు ధర రూ.500-600 పలకగా, మెహిదీపట్నం రైతుబజార్‌లో రూ.700 దాకా పలికింది. బహిరంగ మారెట్లో 100 గ్రాముల చింత చిగురు ధర రూ.50 ఉంది.
Also Read :BRS MLC Kavitha : కవితకు బెయిల్ వస్తుందా ? ఇవాళే కోర్టులో కీలక విచారణ
చింతచిగురులో పోషకాలు
- ప్రతి వంద గ్రాముల చింత చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.6 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం,140మి.గ్రాముల పాస్ఫరస్, 26 మి.గ్రాముల మెగ్నీషియం, 3 మి.గ్రాముల విటమిన్-సీ ఉంటాయి.
- శరీరానికి సోకే ఇన్ఫెక్షన్లను ఇది తగ్గిస్తుంది.
- మధుమేహం ఉన్నవారికి ఇది మేలు చేస్తుంది.