Child Trafficking Gang: నవజాత శిశువులను కొని, అమ్మేస్తున్న ముఠా వ్యవహారంలో కొత్త అప్‌డేట్ ఇది. ఈ ముఠాను నడుపుతున్న గుజరాత్ మహిళ వందనను తెలంగాణలోని రాచకొండ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. హైదరాబాద్ నగరం పరిధిలో ఈ ముఠాను నడుపుతున్న కృష్ణవేణి ఇప్పటికే అరెస్టయింది. ఆమెకు ఈవిషయంలో హెల్ప్ చేసిన 14 మందిని కూడా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు. గుజరాత్ కేంద్రంగా చిన్నారులను అక్రమ రవాణా చేస్తున్న వందనకు, కృష్ణవేణికి మధ్య లింకులు ఉన్నట్లు ఇప్పటికే తేలింది. రిమాండ్‌లో ఉన్న వందనను పోలీసులు విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read :Warangal MGM: తల్లడిల్లుతున్న ‘ఉత్తర తెలంగాణ’ పెద్ద దిక్కు!
చిక్కు ప్రశ్నలు ఇవీ..
- వందన అండ్ గ్యాంగ్(Child Trafficking Gang) ఎన్నేళ్లుగా గుజరాత్ రాష్ట్రం కేంద్రంగా చిన్నారుల అక్రమ రవాణా ముఠాను నడుపుతున్నారు ?
- ఇప్పటివరకు గుజరాత్, ఢిల్లీ నుంచి తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు ఎంతమంది చిన్నారులను అక్రమ రవాణా చేశారు ?
- ఇంకా ఏయే దక్షిణాది రాష్ట్రాల్లో ఈ ముఠా యాక్టివ్‌గా ఉంది ?
- దేశంలోనే ఏయే రాష్ట్రాల్లో ఎంతమేర ఈ ముఠాకు నెట్‌వర్క్ ఉంది ?
- ఈ ముఠా పిల్లల అక్రమ రవాణా కోసం ఎలాంటి ప్లాన్‌లను అమలు చేస్తోంది ?
- గుజరాత్ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు ఈ ముఠా అక్రమ రవాణా చేస్తున్న పిల్లలను ఏం చేస్తున్నారు ? ఎవరికి అమ్ముతున్నారు ?
- ఇప్పటివరకు ఈ ముఠా నుంచి పిల్లలను కొన్న వారు ఎవరెవరు ?
- ఈ ముఠా పిల్లలను అమ్మడానికి ఎలా తీసుకొస్తోంది ?
- ఈ ముఠాకు పిల్లలను ఎవరు అమ్ముతున్నారు ? లేక కిడ్నాప్ చేస్తున్నారా ?
పైన ఉన్న అన్ని ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే దిశగా పోలీసులు ముమ్మర విచారణ చేయనున్నారు. కస్టడీలోకి వచ్చే నిందితుల నుంచి సమాచారాన్ని రాబట్టనున్నారు.
Also Read :Vyjayanthimala : వైజయంతిమాల ఆరోగ్యంపై వదంతులు.. విఖ్యాత నటీమణి జీవిత విశేషాలివీ
కోడ్ భాషలో..
గుజరాత్ మహిళ వందన నడుపుతున్న గ్యాంగ్‌కు హైదరాబాద్, విజయవాడకు చెందిన కొందరు వ్యక్తులు దళారులుగా సహకరిస్తున్నారు. వీరు చైన్ పద్ధతిలో పిల్లలను రేటు కట్టి విక్రయిస్తున్నారు. వీరు విక్రయిస్తున్న పిల్లల్లో ఎక్కువ మంది ఢిల్లీ, గుజరాత్ వారే. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పిల్లలు లేని దంపతులకు ఈ పిల్లలను అమ్ముతున్నట్లు తెలుస్తోంది. ఈ ముఠా గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరాన్ని కేంద్రంగా చేసుకొని కార్యకలాపాలు సాగిస్తోందని గుర్తించారు. ఈ ముఠా పిల్లలను అమ్మే క్రమంలో, వారి రవాణా కోసం కోడ్ భాషను వాడుతోంది. ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించకుండా జాగ్రత్త పడుతోంది.