Site icon HashtagU Telugu

Chikoti Praveen: థాయ్ లాండ్ పోలీసులకు చిక్కిన చీకోటి, 93 మంది అరెస్ట్

Chikoti Praveen

Chikoti Praveen

క్యాసినో వ్యవహరంలో తెలుగు రాష్ట్రాలో సంచలనం రేపిన చికోటి ప్రవీణ్‌ (Chikoti Praveen) థాయ్‌లాండ్‌ పోలీసులకు చిక్కాడు. థాయ్‌లాండ్ పట్టాయాలోని ఓ విలాసవంతమైన హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున అక్కడి పోలీసులు (Police) దాడి జరిపి పెద్ద మొత్తంలో గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్టుగా గుర్తించారు. మొత్తం 93 మందిని అరెస్ట్ (Arrest) చేయగా.. అందులో 80 మందికి పైగా భారతీయులు ఉన్నారు. అరెస్ట్ అయినవారిలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నారు. అంతేకాకుండా తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కూడా థాయ్ లాండ్ పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. వీరిని ప్రవీణ్ అక్కడికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

నిందితుల నుంచి భారీగా నగదు, గేమింగ్ (Gaming) చిప్స్‌ను థాయ్‌లాండ్‌ పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. గేమింగ్ చిప్స్‌ విలువ రూ. 20 కోట్లకు పైగా ఉంటుందని స్థానిక పోలీసులు చెబుతున్నారు. ఏప్రిల్ 27-మే 1 వరకు హోటల్‌లో అనేక మంది భారతీయులు గదులు బుక్ చేసుకున్నారని.. జూదం కోసం సంపావో అనే సమావేశ గదిని అద్దెకు తీసుకున్నారని డిటెక్టివ్‌ల నుండి వచ్చిన సమాచారం మేరకు ఈ దాడి జరిగిందని అక్కడి  పోలీసులు వెల్లడించారు. ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: New Secretariat: కేసీఆర్ ఫస్ట్ రివ్యూ.. కీలక అంశాలపై చర్చ!