తెలంగాణ లో ఎన్నికలు (Telangana Elections) సమీపిస్తున్న తరుణంలో అధికార , ప్రతిపక్ష పార్టీ లలో వలసల పర్వం కొనసాగుతుంది. ముఖ్యంగా టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తమకు అనుకూలం అనుకునే పార్టీ లో చేరుతున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ (Congress Party) లో పెద్ద ఎత్తున బిఆర్ఎస్ (BRS) నేతలు చేరగా…బిఆర్ఎస్ లో కూడా అదే రీతిలో కాంగ్రెస్ నేతలు చేరుతున్నారు. ఇప్పటికే పలువురు కీలక నేతలు కండువాలు మార్చుకోగా..తాజాగా ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు, పీసీసీ ఉపాధ్యక్షుడు, తెలంగాణ ఉద్యమకారుడు డాక్టర్ చెరుకు సుధాకర్ (Cheruku Sudhakar) బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మంత్రి హరీశ్‌రావు (Harish Rao) కలిసి చెరుకు సుధాకర్‌కు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
We’re now on WhatsApp. Click to Join.
బీసీ నేతల విషయంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ నేతల తీరును నిరసిస్తూ డాక్టర్ చెరుకు సుధాకర్ ఆ పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఏ పదవీ లేకపోయినా భరించవచ్చు గానీ ఆత్మగౌరవం లేని రాజకీయ ప్రయాణం నిష్ప్రయోజనం అని భావించి రాజీనామా చేస్తున్నట్టు శుక్రవారం ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో ఆర్థిక పరిపుష్టి కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి వంటి వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని, మధుయాష్కీ వంటి బీసీల నేతల స్థాయిని తగ్గిస్తూ అవమానకరంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అలాగే హరీశ్ రావు మాట్లాడుతూ… చెరుకు సుధాకర్ కరుడుగట్టిన తెలంగాణ ఉద్యమకారుడు అన్నారు. ఉద్యమం సమయంలో రాజీనామా చేయకుండా పారిపోయిన వ్యక్తి ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నాడని విమర్శించారు. ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టిన ఘనత ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిది అన్నారు. రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకుంటున్నారని కాంగ్రెస్ నేతలే ఆరోపణలు చేస్తున్నారన్నారు.
Read Also : Bigg Boss : కుండ బద్దలు కొడుతూ..హౌస్ సభ్యుల ఫై నాగ్ సీరియస్