Cheetah Dies : నారాయణపేట జిల్లాలో ఎండదెబ్బకు చిరుత మృతి

ఈ ఎండలకు కేవలం మనుషులే కాదు అడవిలో ఉన్న జంతువులు సైతం మృతువాత పడుతున్నాయి. తాజాగా జాదవరావుపల్లిలో వడదెబ్బతో చిరుత మృతి చెందింది

  • Written By:
  • Publish Date - May 5, 2024 / 09:04 PM IST

తెలంగాణ లో ఎండలు (Heavy Heat Waves) ఏ రేంజ్ లో కొడుతున్నాయో చెప్పాల్సిన పనిలేదు. రాష్ట్రంలోని అనేక జిల్లాలో ఏకంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంది. రెండు రోజుల్లో 50 డిగ్రీలకు చేరుకున్న ఆశ్చర్యపోనవసరం లేదు. ఈ ఎండలకు తట్టుకోలేక చాలామంది మృత్యువాత పడుతున్నారు. నిన్న ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా వడదెబ్బకు 19 మంది మృతి (19 Deaths Sunstroke) చెందారంటే అర్ధం చేసుకోవాలి. ఈ ఎండలకు కేవలం మనుషులే కాదు అడవిలో ఉన్న జంతువులు సైతం మృతువాత పడుతున్నాయి. తాజాగా జాదవరావుపల్లిలో వడదెబ్బతో చిరుత మృతి (Cheetah Dies) చెందింది.

We’re now on WhatsApp. Click to Join.

వేసవిలో ఎండలు తీవ్రంగా ఉండడంతో అటవీ ప్రాంతంలో బుక్కెడు నీళ్లు దొరకని పరిస్థితి ఏర్పడుతోంది. తాగునీటి సమస్య జనాలకే కాకుండా మూగజీవాలకు సైతం తప్పడం లేదు. అడవి ప్రాంతంలో ఉండే చెరువులు, కుంటలు అడుగంటిపోవడంతో వన్య ప్రాణులకు తాగునీటి ఎద్దడి ఏర్పడుతోంది. వేసవిలో దప్పిక తీర్చేందుకు సంబంధిత అటవీశాఖ అధికారులు విఫలమవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీంతో వన్యప్రాణులకు గుక్కెడు నీళ్లు కోసం జనావాసాల్లోకి వస్తుండగా మరికొన్ని నీళ్లు దొరకక అడవిలోనే మృత్యువాత పడుతున్నాయి. వన్యప్రాణులు నీటి కోసం అడవిని దాటి జనావాసాల్లోకి రావడంతో వేటగాళ్ల ఉచ్చులో పడి మృతి చెందుతున్నాయి.

తాజాగా నారాయణపేట జిల్లా మద్దూరు వరిపొలాల్లో చిరుతపులి చనిపోయి కనిపించింది. ఈ విషయాన్నీ ఫారెస్ట్ అధికారులకు తెలియజేయడంతో వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు..ఎండ వేడి తట్టుకోలేక చిరుహా చనిపోయినట్లు నిర్దారించారు. మద్దూరు కొండల్లో ఎక్కడా మొక్కలు లేవని, ఎండవేడిమి కారణంగా చిరుతపులిలన్నీ కొట్టుకుపోతున్నాయని నారాయణపేట డీఎఫ్‌వో వీణ్ వాణి తెలిపారు.

Read Also : Ambati Rambabu : పవన్ కల్యాణే ..నా అల్లుడ్ని రెచ్చగొట్టింది – అంబటి రాంబాబు