Trains Timings Changed : రైళ్ల కొత్త టైమ్ టేబుల్ ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. దక్షిణ మధ్య రైల్వేతో పాటు దేశవ్యాప్తంగా అన్ని రైల్వే జోన్లలో ఈ మార్పు జరిగింది. మారిన రైళ్ల వేళలను తెలుసుకునేందుకు మనం ఐఆర్‌సీటీసీ, ఎన్‌టీఈఎస్ వెబ్‌సైట్లను చూడొచ్చు. ఇక్కడ ఉన్న (NTES – https://enquiry.indianrail.gov.in/mntes/) లింకును క్లిక్ చేస్తే నేరుగా ఎన్‌టీఈఎస్ వెబ్‌సైటులోకి వెళ్తారు. ప్రయాణికులు తాము తరచుగా రాకపోకలు సాగించే రైళ్ల టైమింగ్స్‌ను ఇందులో తెలుసుకోవచ్చు. 2025 సంవత్సరంలో నమో భారత్ ర్యాపిడ్ రైల్ (వందే మెట్రో), అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ కలిపి మొత్తం 136 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌ను రైల్వే శాఖ నడపబోతోంది. ఈ అప్‌గ్రేడ్ చేసిన రైళ్ల ద్వారా ప్రయాణికులకు మరింత సౌకర్యం కలగనుంది.
ఇవి తెలుసుకోండి..
- విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్లే రత్నాచల్ ఎక్స్‌ప్రెస్(Trains Timings Changed).. విజయవాడ స్టేషన్ నుంచి ఇకపై 15 నిమిషాలు ముందే బయలుదేరుతుంది. ఇప్పటివరకూ ఉదయం 6.15 గంటలకు బయలుదేరి వెళ్తున్న ఈ రైలు, ఇక నుంచి ఉదయం 6కే వెళ్లిపోతుంది.
- హైదరాబాద్ పరిధిలో నడిచే ఎంఎంటీఎస్ సర్వీసుల వేళల్లోనూ మార్పులు జరిగాయి. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల టైమింగ్స్‌కు అనుగుణంగా కొత్త టైమింగ్స్ ఉంటాయి.
- కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరే ప్రధాన రైళ్లలో టైమింగ్స్ మారినవి ఇవే.. యశ్వంత్‌పూర్-కోయంబత్తూర్, యశ్వంత్‌పూర్-కోర్బా, నిజాముద్దీన్-కోయంబత్తూర్, యశ్వంత్‌పూర్ -నిజాముద్దీన్, తిరుపతి-నిజాముద్దీన్, తిరుపతి-సికింద్రాబాద్, అమరావతి-తిరుపతి, తిరుపతి-అమరావతి, మహబూబ్‌నగర్- విశాఖపట్నం, మైసూర్-జైపూర్, జైపూర్-మైసూర్, చెన్నై-నాగర్‌సోల్, యశ్వంత్‌పూర్-గోరఖ్‌పూర్, రామేశ్వరం-ఓకా, నర్సపూర్-నాగర్‌సోల్, యశ్వంతపూర్-అంబేడ్కర్ నగర్, కర్నూల్-జైపూర్, యశ్వంతపూర్-కాచిగూడ, కాచిగూడ-యశ్వంతపూర్, యశ్వంతపూర్-లక్నో.
- సికింద్రాబాద్ స్టేషన్ పరిధిలో టైమింగ్స్ మారిన రైళ్లలో.. వాస్కోడగామా-హైదరాబాద్, హైదరాబాద్-వాస్కోడగామా, పూణె-సికింద్రాబాద్ ట్రైన్స్ ఉన్నాయి.
- నాంపల్లి స్టేషన్ పరిధిలో టైమింగ్స్ మారిన రైళ్లలో.. హైదరాబాద్-ముంబై, ముంబై- హైదరాబాద్, విజయపుర-హైదరాబాద్, హుబ్లీ-హైదరాబాద్ ట్రైన్స్ ఉన్నాయి.
- లింగంపల్లి స్టేషన్ పరిధిలో టైమింగ్స్ మారిన రైళ్లలో.. కాకినాడ-లింగంపల్లి, తిరుపతి-లింగంపల్లి ట్రైన్స్ ఉన్నాయి.