Site icon HashtagU Telugu

Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీ లో చంద్రబాబు ప్రస్తావన

Palla

Palla

తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly)లో బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గురించి అనూహ్యంగా ప్రస్తావన వచ్చింది. బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి (BRS Leader Palla Rajeshwar Reddy) అసెంబ్లీలో మాట్లాడుతూ, కృష్ణా నది యాజమాన్య సంస్థ (Krishna River Management Board) వ్యవహారంపై తీవ్ర విమర్శలు చేశారు. కేఆర్ ఎంబీ పూర్తిగా చంద్రబాబు (Chandrababu) ఆధీనంలో పని చేస్తోందని, ఆయన చెప్పినట్లునే ఆ సంస్థ నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. దీనివల్ల తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీనిపై ఎలాంటి కఠినమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

March 15 : ఈరోజు చంద్రబాబుకు ఎంతో స్పెషల్

హైదరాబాద్ ప్రజలకు తాగు నీటి కొరత మొదలైందని పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీలో పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఈ విషయాన్ని తప్పుబట్టినా, ఆయనకు ఎదురుగానే “నీటి కొరత లేకుంటే వాటర్ ట్యాంకర్లు ఎందుకు తిరుగుతున్నాయి?” అంటూ ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ పాలనలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. దీనికి భట్టి విక్రమార్క కూడా ఘాటుగా స్పందిస్తూ బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలు చేస్తూ అసెంబ్లీలో హంగామా సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Goodbye to Pawan’s Films : ‘OG ‘ నే పవన్ లాస్ట్ సినిమానా..?

పల్లా వ్యాఖ్యలపై భట్టి సమాధానం ఇస్తూ. రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా నది వాటాలో తెలంగాణకు రావాల్సిన నీటిని పూర్తిగా పొందేందుకు కృషి చేస్తోందని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని, నీటి హక్కుల విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో నీటి సమస్య కొత్త విషయం కాదని, గత పాలనల్లో కూడా ట్యాంకర్లు ఉపయోగించేవారనే విషయాన్ని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మంచినీటి సమస్య రాకుండా చర్యలు తీసుకుంటోందని భట్టి విక్రమార్క తెలిపారు. అయితే చంద్రబాబు పేరు అనూహ్యంగా ప్రస్తావనకు రావడం, కేఆర్ ఎంబీ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.