Telangana TDP: బాబు మరో స్కెచ్.. తెలంగాణలో టీడీపీ జెండా

హైదరాబాద్‌కు వస్తున్న టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 7 ఆదివారం నాడు టీడీపీ తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు.రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేసే అంశంపై ఆయన చర్చించే అవకాశం ఉంది

Telangana TDP: తెలంగాణలో టీడీపీ మరోసారి పుంజుకుంటుందా? , ఏపీలో అధికార దక్కించుకున్న చంద్రబాబు తెలంగాణలోనూ పాగా వేయాలని భావిస్తున్నాడా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే తెలంగాణలో రేవంత్ రెడ్డి సారధ్యంలో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. అయితే రేవంత్ కు వ్యతిరేకంగా బాబు రాజకీయం చేయకపోవచ్చు. కానీ ఎంపీ సీట్లను పెంచుకునే విషయంలో చంద్రబాబు తెలంగాణలో పార్టీని బలోపేతం చేయబోతున్నట్లు తెలుస్తుంది.

ఈ రోజు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌కు వస్తున్న టీడీపీ(TDP) అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు జులై 7 ఆదివారం నాడు టీడీపీ తెలంగాణ నేతలతో సమావేశం కానున్నారు.రాష్ట్రంలో టీడీపీని బలోపేతం చేసే అంశంపై ఆయన చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించిన తర్వాత, కాసాని జ్ఞానేశ్వర్ పార్టీకి గుడ్ బై చెప్పాడు. అయితే ఆయన స్థానంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా మరో వ్యక్తిని నియమించే అవకాశం ఉంది. 2014లో తెలంగాణ ఏర్పాటయ్యాక కొన్నాళ్లుగా పతనమైన టీడీపీ మళ్ళీ పుంజుకునే అవకాశం రాలేదు. అయితే ఇప్పుడు ఇక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చిన నేపథ్యంలో చంద్రబాబు మరోసారి తెలంగాణలో టీడీపీ పార్టీ జెండా రెపరెపలాడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది.

చంద్రబాబు(Chandrababu) జూలై 6 శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుస్తారు. విభజన సమస్యలపై చర్చిస్తారు. ఆదివారం ఆయన తెలంగాణ నేతలతో సమావేశమై పార్టీ గురించి చర్చించనున్నారు. 2018 ఎన్నికల్లో టీడీపీ తన చిరకాల శత్రువైన కాంగ్రెస్‌తో చేతులు కలిపి అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే కేవలం 19 సీట్లు గెలుచుకోగలిగినందున ఆ కూటమి కాస్త వెనకడుగు వేసింది. నిజానికి, ప్రస్తుత తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరకముందు ఇక్కడ టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. తెలంగాణలో టీడీపీ మళ్లీ తన రాజకీయ స్థానాన్ని పొందే అవకాశం లేకపోలేదని, అయితే ఆంధ్రా నుంచి వలస వచ్చిన వారు ఉన్న ప్రాంతాల్లో కొంత ఓట్లను చేజిక్కించుకునేందుకు ప్రయత్నించవచ్చని కొందరు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

Also Read: Telangana- AP CMs: ఇరు రాష్ట్రాల సీఎంల స‌మావేశానికి ముహూర్తం ఖ‌రారు.. వేదిక‌గా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌..!