Munugode : ఏపీపై మునుగోడు చిత్రం

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఏపీ రాజకీయాన్ని మార్చబోతుంది. తెలుగుదేశం పార్టీ వలన లాభాన్ని బీజేపీ అంచనా వేస్తోంది.

  • Written By:
  • Updated On - October 21, 2022 / 03:00 PM IST

మునుగోడు ఉప ఎన్నిక ఫలితం ఏపీ రాజకీయాన్ని మార్చబోతుంది. తెలుగుదేశం పార్టీ వలన లాభాన్ని బీజేపీ అంచనా వేస్తోంది. పీసీసీ చీఫ్ రేవంత్ కు ఉన్న ఓటు బ్యాంకు తెలుగుదేశం వెంట వెళుతుంది. దీంతో ఆయనకు సొంత ఓటు బాంక్ అంటూ ఇక ఉండదు. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ కి బహిరంగంగా టీడీపి మద్దతు ఇస్తుంది. ఫలితంగా కాంగ్రెస్ కు నష్టం జరుగుతుంది. బీజేపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి కూడా మునుగోడులో చేతులు ఎత్తివేసాడని టాక్.

మునుగోడు ఫార్ములా విజయవంతం అయితే ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తు వెంటనే ఖరారు కానుంది. ఇప్పటికే రాష్ట్రపతి – ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అడగకుండానే మద్దతిచ్చి భర్తీ చేసుకొనే ప్రయత్నం టీడీపీ చేసింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ లక్ష్యం తెలంగాణ లో అధికారం. ఇందుకు సహకరించేందుకు చంద్రబాబు సానుకూల సంకేతాలు పంపుతున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా పార్టీ సమావేశంలో తెలంగాణలో 7-14 సీట్లలో పోటీ, 2-4 ఎంపీ సీట్లలో పోటీ చేద్దామంటూ ప్రతిపాదన చేసారు.

Also Read:   SBI ఖాతాదారులకు శుభవార్త

అటు చంద్రబాబు ఈ మధ్య కాలంలో తెలంగాణలో పార్టీ వ్యవహారాల పైన ఎక్కువగా ఫోకస్ పెట్టారు. కేసీఆర్ రాజకీయ శత్రువుగా మారిన బీజేపీకి సాయం అందించటం ద్వారా ఒకే దెబ్బకు ఇటు కేసీఆర్ అటు ఏపీలో జగన్ కు షాక్ ఇవ్వాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తోంది.
తెలంగాణలోనే ముందుగా అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో ఆ సమయాన్ని చంద్రబాబు సద్వినియోగం చేసుకోబోతున్నారు. తెలంగాణలో టీడీపీ – బీజేపీ – జనసేన పొత్తుకు బీజం పడనుంది. కేసీఆర్ ను దెబ్బ తీయటంలో బీజేపీకి సహకరించి ఏపీలో పొత్తు ఖాయం చేసుకోవాలని టీడీపీ అడుగులు వేస్తోంది. టీడీపీ – జనసేన తో కలవటం ద్వారా హైదరాబాద్ – రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో బీజేపీకి కలిసి వస్తుందనే విశ్లేషణలను టీడీపీ నేతలు తెర మీదకు తీసుకొస్తున్నారు. అయితే, తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం చంద్రబాబుతో పొత్తు విషయంలో డైలమాలో ఉన్నారు.

చంద్రబాబుతో చేతులు కలిపితే కేసీఆర్ కు ఆయుధం అందిచనట్లు అవుతుందనే వాదన ఉంది. గతంలో సీఎం కేసీఆర్ ఇదే రకమైన ప్రచారంతో టీడీపీని తెలంగాణకు దాదాపుగా దూరం చేసారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో జత కట్టిన టీడీపీ ఇప్పుడు బీజేపీతో జత కడితే రాజకీయంగా నష్టపోతామనేది ఆ పార్టీ నేతల వాదన. కానీ, భారత్ రాష్ట్ర సమితిగా మార్చటం ద్వారా ఆ వాదనకు మద్దతు ఉండదనేది మరో అభిప్రాయంగా ఉంది.

Also Read:  Dasoju Sravan: బీజేపీకి దాసోజు గుడ్ బై.. మళ్లీ టీఆర్ఎస్ కు జై!

వాస్తవంగా చంద్రబాబు తొలి టార్గెట్ సీఎం జగన్. అందు కోసం విభిన్న మార్గాలు, కొత్త వ్యూహాలు సిద్దం చేస్తున్నారు. ఏపీలో అధికారం చంద్రబాబు ఆసలు లక్ష్యం. తాజాగా విజయవాడలో జనసేనాని పవన్ కళ్యాణ్ బస చేసిన హోటల్ కు వెళ్లి వైసీపీకి వ్యతిరేకంగా పక్షాల ఐక్యత పైన ప్రతిపాదన చేసారు. పొత్తు దిశగా కీలక అడుగులు వేసారు. ఇదే సమయంలో దూరంగా ఉన్న బీజేపీ ని దగ్గర చేసుకొనేందుకు చంద్రబాబు పావులు కదుపుతున్నారు. 2014 పొత్తులు రిపీట్ చేయాలని చంద్రబాబు ఆశిస్తున్నారు. బీజేపీ కేంద్ర నాయకత్వం నుంచి జగన్ కు ఎటువంటి మద్దతు లేకుండా చేయాలని బాబు ఎత్తుగడ. ఆయన వ్యూహం ఫలించాలి అంటే మునుగుడు బీజేపీ సొంతం కావాలి. అందుకే బీజేపీని మునుగోడులో గెలిపించడానికి టీడీపీ ప్రయత్నం చేస్తోంది.