Site icon HashtagU Telugu

Kothakota Dayakar Reddy: దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాడె మోసిన చంద్రబాబు

Kothakota Dayakar Reddy

Whatsapp Image 2023 06 13 At 6.11.47 Pm

Kothakota Dayakar Reddy: మక్తల్ మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి మృతి పట్ల ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. దయాకర్ రెడ్డి స్వగ్రామానికి వెళ్లి నివాళులు అర్పించారు. తనతో ఉన్న చిరకాల స్నేహాన్ని గుర్తు చేసుకున్నారు. దయాకర్ రెడ్డి భౌతికకాయాన్ని చూసి చంద్రబాబు భావోద్వేగానికి గురయ్యారు.

దయాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం దయాకర్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. ఆయ‌న‌ స్వస్థలం మహబూబ్‌ నగర్‌ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని పర్కాపురంలో అంత్యక్రియలు నిర్వహించారు.

కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న దయాకర్ రెడ్డి హైదరాబాదులోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. టిడిపి పార్టీ నుండి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994,1999,2009 లలో మూడు సార్లు ఎమ్మెల్యేగా సేవలు అందించారు. అమరచింత నియోజకవర్గం నుండి 2 సార్లు,మక్తల్ నియోజకవర్గం నుండి ఒక సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం టిడిపి పార్టీ జాతీయ కార్యదర్శిగా ఉన్నారు. దయాకర్ రెడ్డి స్వగ్రామం పర్కాపుర్ గ్రామం,నర్వ మండలం,నారాయణపేట జిల్లా.

Read More: Pawan Kalyan : పవన్ కోసం ఏపీకి తరలిన నిర్మాతలు.. ఇకపై షూటింగ్స్ కూడా అక్కడే..