Site icon HashtagU Telugu

Earthquake : భద్రాచలం లో భూకంపం వచ్చే ఛాన్స్..?

Bcm Earthquake

Bcm Earthquake

భద్రాచలం (Bhadrachalam) భూకంప (Earthquake ) ప్రభావిత ప్రాంతంగా శాస్త్రవేత్తలు గుర్తించారు. భూకంపాల ఏర్పాటుకు అనుకూలమైన జోన్-3 పరిధి(Zone-3 Area)లో ఈ ప్రాంతం ఉండటంతో భూకంపాలు స్వల్పంగా సంభవించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. భద్రాచలం పరిసర ప్రాంతాల్లో భూకంప తీవ్రత 0.125 గ్రావిటీగా నమోదవుతుందని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. భూభాగం అంతర్గత మార్పుల కారణంగా ఇక్కడ కాలక్రమేణా తక్కువ తీవ్రతతో భూకంపాలు సంభవిస్తున్నాయని వారు పేర్కొన్నారు.

MI vs KKR: రెండు ఓట‌ముల త‌ర్వాత ఘ‌న విజ‌యం సాధించిన ముంబై ఇండియ‌న్స్‌!

గత 56 ఏళ్లలో భద్రాచలం ప్రాంతంలో 199 సార్లు భూకంపాలు సంభవించాయని అధ్యయనాలు చెబుతున్నాయి. 1969లో పర్ణశాలలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేలుపై 5.5 తీవ్రతను నమోదు చేయగా, ఇది ఇక్కడ జరిగిన అతి పెద్ద భూకంపంగా పేర్కొనబడింది. ఇటీవల 2024 డిసెంబర్ 4న కూడా భద్రాచలం ప్రాంతంలో స్వల్పంగా భూమి కంపించిందని అధికారులు వెల్లడించారు. అయితే ఇక్కడ సంభవించే భూకంపాలు సాధారణంగా తక్కువ తీవ్రతతో ఉంటాయని, ప్రజలు అధికంగా భయపడాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలిపారు.

భద్రాచలంలో భూకంప సంభవం గురించి ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. భూకంపాల సమయంలో అనుసరించాల్సిన జాగ్రత్తలు, భద్రతా చర్యలపై ప్రజలకు తగిన సమాచారాన్ని అందించాలి. ప్రభుత్వ అధికారులు, భూకంప పరిశోధకులు కలిసి ఈ ప్రాంతంలో భవిష్యత్తులో సంభవించగల భూకంపాలపై సుదీర్ఘ పరిశోధనలు చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

HCU Land Issue : ఆందోళన చేసిన ఇద్దరు అరెస్ట్