kishan Reddy : ధర్నాలు చేస్తాం, నాలుకలు చీరేస్తామంటే భయపడేదే లేదు!

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. ఇక తెలంగాణలో పాలిటికల్ హీట్ తగ్గినట్టేనని భావించారు. కానీ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతనే రాజకీయాలు మరింత వేడెక్కాయని చెప్పక తప్పదు.

  • Written By:
  • Updated On - November 9, 2021 / 03:11 PM IST

హుజురాబాద్ ఉప ఎన్నిక ముగిసింది. ఇక తెలంగాణలో పాలిటికల్ హీట్ తగ్గినట్టేనని భావించారు. కానీ ఉప ఎన్నిక ముగిసిన తర్వాతనే రాజకీయాలు మరింత వేడెక్కాయని చెప్పక తప్పదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు సార్లు మీడియా ముందుకురావడం, బీజేపీని లక్ష్యంగా చేసుకొని వార్నింగ్ ఇవ్వడం, బీజేపీ నాయకులు కూడా ఎదురుదాడికి దిగడం లాంటివన్నీ హాట్ టాపిక్ గా మారాయి. తాజాగా కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డి మీడియా ముందుకొచ్చి కేసీఆర్ కు గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగానే ఎంతోమంది రైతులు నష్టపోయారని, పంజాబ్ తర్వాత తెలంగాణలోనే వడ్లు ఎక్కువగా కేంద్రం కొనుగులు చేసిందని కిషన్ రెడ్డి తెలిపారు. 2014లో మోదీ ప్రభుత్వం రాక ముందు కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో 64 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించింది. బీజేపీ ప్రభుత్వం 151 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తోందన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 94 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ధర్నాలు చేస్తే, నాలుకలు చీరుస్తామంటే భయపడేది లేదంటూ కిషన్ రెడ్డి స్పష్టంచేశారు. లేనిపోని మాటలు చెప్పి రైతులను తప్పుదోవపట్టించొద్దంటూ సూచించారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి యూపిఏ ప్రభుత్వంలో మూడు వేల కోట్ల రూపాయలు ఉన్న దాన్ని 26 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టి బియ్యం కోనుగోలు చేస్తుందని ఆయన చెప్పారు. కాగా ఇది దేశంలోని పంజాబ్ రాష్ట్రం తర్వాత తెలంగాణలోనే అత్యధికంగా కొనుగులు చేస్తున్నామని చెప్పారు. ఇక ధర్నాలు చేస్తాం, నాలుకలు చీరేస్తామంటే భయపడే పరిస్థితి లేదని అన్నారు. ఇక చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని చెప్పారు. పెట్రోల్ డీజిల్‌పై పెంచిన ధరలతో ప్రజలపై భారం పడుతుందనే ఉద్దేశ్యంతోనే ట్యాక్సిలు తగ్గించామని అదే తరుణంలో ఆయా రాష్ట్రాలను కూడా కోంతమేర తగ్గించాలని కొరామని చెప్పారు. దీనికి ఇంత బాధ ఎందుకని అన్నారు. దీనికి కేంద్రం దోచుకుంటుందని ప్రచారం చేయడంపై ఆయన ఫైర్ అయ్యారు. ఈ క్రమంలోనే కేంద్రం ధరలు పెంచి ఫాం హౌజ్‌ల్లో దాచుకుంటున్నామని ఆయన ప్రశ్నించారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా 2015లో పెంచిన టాక్స్ ను ప్రస్థావించారు. ఇప్పటికైనా సానుకూలంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు.