Site icon HashtagU Telugu

Kondareddypalli : రేవంత్ స్వగ్రామంలో అంబరాన్నంటిన సంబరాలు

Celebrations At Revanth Red

Celebrations At Revanth Red

రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతుండడం తో ఆయన స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లి (Kondareddypalli )లో సంబరాలు అంబరాన్ని తాకాయి. గ్రామస్తులంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్స్ పంచుకుంటూ , బాణా సంచా కలుస్తూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ (Congress ) ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 64 స్థానాల్లో విజయం సాధించి..మరో పార్టీ ఎమ్మెల్యేల మద్దతు లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. అయితే సీఎం అభ్యర్థి ఎవరన్న విషయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే తాజాగా రెండు రోజుల ఉత్కంఠకు తెరపడింది. పీసీసీ చీఫ్‌గా.. పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించిన రేవంత్ రెడ్డినే సీఎల్పీ నేతగా పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. దీంతో ఆయన రేపు తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక రేవంత్ సీఎం కావడం తో ఆయన స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో సంబరాలు జరుపుకున్నారు. రంగులు చల్లుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ సందడి చేశారు. ఇప్పటి నుంచి మాది సీఎం ఊరు అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి సీఎం కావడం.. అది తమ గ్రామస్తువడం గర్వంగా ఉందన్నారు.

Read Also : Revanth Reddy : కాంగ్రెస్ ఆరు గ్యారంటీ పథకాల అమలు ఫైల్ ఫై రేవంత్ తొలి సంతకం