CBN Target:తెలంగాణ ఎన్నిక‌లకు`నాంప‌ల్లి గ్రౌండ్స్`లో మ‌లుపు

నాంప‌ల్లి గ్రౌండ్స్ (CBN Target) పసుపు మ‌యం అవుతోంది. హైద‌రాబాద్(Telangana) కేంద్రంగా

  • Written By:
  • Publish Date - March 27, 2023 / 12:40 PM IST

నాంప‌ల్లి గ్రౌండ్స్ (CBN Target) పసుపు మ‌యం అవుతోంది. సుమారు ఐదేళ్ల తరువాత హైద‌రాబాద్(Telangana) కేంద్రంగా టీడీపీ క్యాడ‌ర్ ఉత్సాహంగా క‌నిపిస్తోంది. ఈనెల 29న పార్టీ ఆవిర్భావ దినోత్స‌వాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి స‌న్న‌ద్ధం అయింది. భారీ ఏర్పాట్ల సంద‌డి నెల‌కొంది. ద‌శాబ్దం క్రితం మ‌రిచిపోయిన హ‌డావుడి ఇప్పుడు తెలుగు త‌మ్ముళ్ల‌లో క‌నిపిస్తోంది. వివిధ విభాగాల‌కు చెందిన 12 క‌మిటీలు యుద్ధ ప్రాతిప‌దిక‌న ప‌నిచేస్తున్నాయి. గ్రౌండ్స్ ను ఆదివారంనాడు ఆధీనంలోకి తీసుకున్న టీడీపీ భారీ ఏర్పాట్ల‌కు డిజైన్ చేసింది. ఏపీ, తెలంగాణ‌తో పాటు అండమాన్ నుంచి కూడా ఈసారి టీడీపీ నేత‌లు హైద‌రాబాద్ కు రానున్నారు. ఇప్ప‌టికే ఎన్నారై విభాగం యాక్టివ్ అయింది. ప్ర‌పంచ న‌లుమూలలా ఉండే టీడీపీ కీల‌క విభాగాల నేత‌ల హాజ‌రు కానున్నారు. ఈ స‌భ ద్వారా ప‌లు కీల‌క తీర్మానాలు చేయ‌బోతున్నారు.

నాంప‌ల్లి గ్రౌండ్స్ పసుపు మ‌యం(CBN Target) 

జాతీయ స్థాయిలో తెలంగాణ(Telangana) మోడ‌ల్ ను కేసీఆర్ చూపుతున్నారు. ఆ మోడ‌ల్ కు పునాదులు వేసిన ఘ‌న‌త టీడీపీదే. అంతేకాదు, చంద్ర‌బాబు విజ‌న్ (CBN Target) కార‌ణంగా హైద‌రాబాద్ ఇవాళ ప్ర‌పంచ‌వ్యాప్తంగా మారుమోగుతోంది. ఆ విష‌యాన్ని బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ప‌లు వేదిక‌ల‌పై చెప్పారు. ఆయ‌న వేసిన అభివృద్ధి పునాదుల‌ను ఎవ‌రూ కాద‌న‌లేర‌ని ప్ర‌క‌టించారు. అందుకే, తెలంగాణ వ్యాప్తంగా ఇదే వాయిస్ ను టీడీపీ వినిపించ‌బోతుంది. జాతీయ దూకుడును కేసీఆర్ ఎంత ప్ర‌ద‌ర్శిస్తే అంత‌కంటే ఎక్కువ‌గా టీడీపీ తెలంగాణ‌లో దూసుకుపోవాల‌ని భావిస్తోంది. ఇటీవ‌ల వ‌ర‌కు ఏపీ పార్టీగా ముద్ర‌వేసి టీడీపీని బ‌ద్నాం చేసిన కేసీఆర్ ఇప్పుడు ఏమీ అన‌లేని ప‌రిస్థితుల్లో ఉన్నారు. అందుకే, క‌లిసొచ్చిన రాజ‌కీయ వాతావ‌ర‌ణాన్ని సానుకూలంగా మ‌లుచుకోవాల‌ని టీడీపీ భావిస్తోంది.

వాతావ‌ర‌ణాన్ని సానుకూలంగా మ‌లుచుకోవాల‌ని టీడీపీ

ఇటీవ‌ల ఖ‌మ్మంకు ఏడేళ్ల త‌రువాత చంద్ర‌బాబు(CBN Target) వెళ్లారు. ఆయ‌న ముఖ్య అతిథిగా పాల్గొన్న స‌భ సూప‌ర్ హిట్ అయింది. ఆ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీ మేలుకుంది. స్వ‌చ్చంధంగా త‌ర‌లి వ‌చ్చిన జ‌నాన్ని చూసిన త‌రువాత ఎన్నో మార్పులు చేయ‌డానికి బీఆర్ఎస్ ప్ర‌య‌త్నించింది. అక్క‌డ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించిన కేసీఆర్ జ‌ర్న‌లిస్ట్ ల‌కు ఇళ్ల స్థలాల‌తో పాలు ప‌లు తాయిలాల‌ను ఆ జిల్లాకు ప్ర‌క‌టించారు. కానీ, టీడీపీ ఓటు బ్యాంకు ఖ‌మ్మం జిల్లాలో ప‌దిలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ మీద అభిమానం ఆ జిల్లా ఓట‌ర్ల నుంచి ఎవ‌రూ చెర‌ప‌లేనిది. అదే త‌ర‌హాలో హైద‌రాబాద్‌, రంగారెడ్డి జిల్లాలోనూ టీడీపీకి బ‌లం ఉంది. పైగా ఇటీవ‌ల బీసీ నేత‌గా పేరున్న కాసాని జ్ఞానేశ్వ‌ర్ కు పార్టీ ప‌గ్గాలు అప్ప‌గించిన త‌రువాత సంస్థాగ‌త మార్పులు ఎన్నో జ‌రిగాయి. పార్టీ (Telangana) బ‌లోపేతం అవుతోంది.

Also Read : CBN Plan:ఏపీ జోష్ తెలంగాణ‌కు.!హైద‌రాబాద్ లో టీడీపీ స‌భ‌!

ఏపీలో ఇటీవ‌ల టీడీపీ సాధించిన విజ‌యాల‌ను మ‌రుపురానివి. మూడు ప‌ట్ట‌భ‌ద్రులు, ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ గెలుచుకున్న ఉత్సాహం తొణికిస‌లాడుతోంది. అదే జోష్ ను ఇప్పుడు తెలంగాణ విభాగానికి కూడా అందించాల‌ని టీడీపీ (CBN Target)భావిస్తోంది. ఏపీలో ఈసారి ఎన్నిక‌ల్లో అధికారం ఖాయంగా ఇటీవ‌ల టీడీపీ సాధించిన విజ‌యాల‌ను బెంచ్ మార్క్ గా ఆ పార్టీ భావిస్తోంది. అందుకే, తెలంగాణ‌లో కింగ్ మేక‌ర్ కావాల‌ని చూస్తోంది. ప్ర‌త్య‌ర్థి పార్టీల్లోని బ‌ల‌హీన‌తల కంటే టీడీపీకి ఉన్న ప్లస్ పాయింట్ల మీద ఫోక‌స్ పెట్టింది. తెలంగాణ‌కు టీడీపీ చేసిన సేవ‌ను ఈ త‌రంకు అందించ‌డానికి సిద్ధ‌మ‌యింది. అందుకోసం భారీ వేదిక‌గా ఆవిర్భావ స‌భ‌ను తీసుకుంటోంది. వాస్త‌వంగా ఖ‌మ్మం స‌భ త‌రువాత వ‌రంగ‌ల్‌, నిజామాబాద్‌, సికింద్రాబాద్ స‌భ‌లను ప్లాన్ చేశారు. పార్టీ ఆవిర్భావ స‌భ‌ను ఏపీలో నిర్వ‌హించాల‌ని అనుకున్నారు. కానీ, తాజాగా ఏపీలోని ప‌రిణామాలు పూర్తిగా అనుకూల దిశ‌గా రావ‌డంతో తెలంగాణ(Telangana) వైపు టీడీపీ మ‌ళ్లింది.

నాంప‌ల్లి గ్రౌండ్స్ లో చేస్తోన్న భారీ ఏర్పాట్లను ప్ర‌త్య‌ర్థి పార్టీలు నిశితంగా…

బ‌హిరంగ స‌భ‌ల‌ను నిర్వ‌హించ‌డం టీడీపీకి కొత్తేమీకాదు. స‌భ‌కు వ‌చ్చే జ‌నానికి ఏ మాత్రం ఇబ్బందులు క‌లుగ‌కుండా ఏర్పాట్లు చేయ‌డం ఆ పార్టీకి తెలుసు. అందుకే, 12 క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. డ‌యాస్ నుంచి మంచినీళ్ల‌ను అందించే వ‌ర‌కు వివిధ క‌మిటీల‌ను ఏర్పాటు చేసింది. సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను రాజ‌కీయంగా తీసుకొచ్చిన పార్టీ టీడీపీ. ఆ విష‌యంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇప్ప‌టికే కొత్త పాట‌ల‌ను తెలంగాణ (Telangana)ప్ర‌జ‌ల‌కు వినిపించ‌డానికి సిద్ధ‌మ‌యింది. గ‌త 40ఏళ్లుగా టీడీపీ చేసిన సేవ‌ను గుర్తు చేస్తూ ప‌ల్లె పాట‌ల‌ను ట్యూన్ చేశారు. ప్ర‌ద‌ర్శ‌న‌ల‌ను కూడా వివిధ రూపాల్లో చేయ‌బోతున్నారు. ఈ స‌భ ద్వారా కార్యాచ‌ర‌ణ ను కూడా ప్ర‌క‌టించ‌బోతున్నారు. ఎన్నిక‌ల దిశ‌గా దిశానిర్దేశం చంద్ర‌బాబు(CBN Target) ఇవ్వ‌బోతున్నారు. ఆయ‌న వ్యూహం ఈసారి తెలంగాణ‌లోనూ ఫ‌లితాల‌ను ఇస్తుంద‌ని క్యాడ‌ర్ విశ్వ‌సిస్తోంది. అందుకే, నాంప‌ల్లి గ్రౌండ్స్ లో చేస్తోన్న భారీ ఏర్పాట్లను ప్ర‌త్య‌ర్థి పార్టీలు నిశితంగా ప‌రిశీలిస్తున్నాయి. ఆవిర్భావ స‌భ వేదిక‌గా చంద్ర‌బాబు ఇచ్చే డైరెక్ష‌న్ ఈ ఏడాది జరిగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌ను మలుపు తిప్ప‌నుంది.

Also Read : TDP : టీడీపీ ఎమ్మెల్యే నిమ్మ‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు.. 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు మాతోనే..?