Site icon HashtagU Telugu

CBN Strength : కాంగ్రెస్ వైపు చంద్ర‌బాబు శిష్యులు

Cbn Strength

Cbn Strength

CBN Strength : తెలుగుదేశం పార్టీ స‌హ‌కారం లేకుండా బీజేపీ లేన‌ట్టేనా? తెలుగు రాష్ట్రాల్లో క‌మ‌లంకు స్థానం కోసం టీడీపీ అవ‌స‌రం ఉందా? చంద్రబాబును బీజేపీ దూరంగా పెడుతుందా? లేక చంద్ర‌బాబు వ్యూహాత్మ‌కంగా ఢిల్లీ బీజేపీ పెద్ద‌ల‌కు దూరంగా ఉంటున్నారా? ఏమి జరుగుతుంది? అనే దానిపై రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.

తెలుగుదేశం పార్టీతో పొత్తు  పెట్టుకుంటే(CBN Strength)

తెలంగాణ‌లో కింగ్ ఏపీలో కింగ్ మేక‌ర్ కావాల‌ని బీజేపీ ఎత్తుగ‌డ‌. కానీ, ఆ మేర‌కు ఓటు బ్యాంకు మాత్రం ఆ పార్టీ లేద‌ని స‌ర్వ‌త్రా తెలిసిందే. గ‌త అసెంబ్లీలో ఒకే ఒక ఎమ్మెల్యే బీజేపీకి ఉన్నారు. ఆ త‌రువాత ఇద్ద‌రు ఉప ఎన్నిక‌ల ద్వారా క‌లిశారు. ఆ ముగ్గురిలోనూ ఇద్ద‌రు ఇప్పుడు బీజేపీ పార్టీ ప‌ట్ల స‌ఖ్య‌త‌గా లేరని తెలుస్తోంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో కింగ్ ఎలా కావాల‌ని భావిస్తుంది? అనేది పెద్ద ప్ర‌శ్న‌. తెలంగాణ వ్యాప్తంగా 119 చోట్ల అభ్య‌ర్థుల‌ను నిల‌బెట్ట‌డానికి కూడా ఆ పార్టీకి అవ‌కాశం లేదు. లీడ‌ర్లలేని పార్టీగా బీజేపీకి తెలంగాణ‌లో గుర్తింపు ఉంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు (CBN Strength) పెట్టుకుంటే ఆ కొర‌త తీరుతుంది.

లీడ‌ర్లలేని పార్టీగా బీజేపీకి తెలంగాణ‌లో

రాష్ట్ర ఏర్ప‌డిన త‌రువాత జ‌రిగిన 2014 ఎన్నిక‌ల్లో బీజేపీ, టీడీపీ కూట‌మి 19 మంది ఎమ్మెల్యేల‌ను గెలుచుకుంది. ఇప్ప‌టికీ టీడీపీకి ఓట‌ర్లు ఉన్నారు. క్యాడ‌ర్ కొంత మేర‌కు ఉంది. లీడ‌ర్లు కూడా ఉన్నారు. అందుకే, 119 చోట్ల అభ్య‌ర్థుల‌ను నిల‌ప‌డానికి టీడీపీ సిద్ధ‌మ‌యింది. ఆ త‌రువాత బ‌స్సు యాత్ర కూడా చేస్తామ‌ని టీడీపీ తెలంగాణ విభాగం చీఫ్ జ్ఞానేశ్వ‌ర్ ప్ర‌క‌టించారు. అదే జ‌రిగితే, బీజేపీకి చాలా చోట్ల డిపాజిట్లు వ‌స్తాయ‌న్న న‌మ్మ‌కం లేదు. ఆ విష‌యం తెలిసి కూడా టీడీపీతో క‌లిసి న‌డిచేందుకు బీజేపీ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఇంకో వైపు బీఆర్ఎస్ పార్టీ మీద అసంతృప్తిగా ఉన్న లీడ‌ర్లు కాంగ్రెస్ లోకి వెళుతున్నారు. వాళ్లంద‌రూ ఒక‌ప్పుడు చంద్ర‌బాబునాయ‌కుడు శిష్యులు (CBN Strength) కావ‌డం గ‌మ‌నార్హం.

119 చోట్ల అభ్య‌ర్థుల‌ను నిల‌ప‌డానికి టీడీపీ

ఇక ఏపీ బీజేపీ ఆ రాష్ట్రంలో నామ‌మాత్రం. క‌నీసం 2శాతం కూడా ఓటు బ్యాంకులేని పార్టీగా ఉంది. అయిన‌ప్ప‌టికీ ఢిల్లీ పెద్ద‌ల చాక‌చ‌క్యంతో వైసీపీని ఒక వైపు మోస్తూ టీడీపీతో స‌ఖ్య‌త‌ను ప్ర‌ద‌ర్శిస్తోంది. జ‌న‌సేన పార్టీతో పొత్తు అంటూ కాలం వెళ్ల‌దీస్తోంది. ఇలాంటి పార్టీతో పొత్తుకు ఎవ‌రూ ముందుకు రారు. అందుకే, ఎన్డీయే కూట‌మిలో చేర‌డానికి ఏపీలోని ఏ పార్టీ ఇంట్ర‌స్ట్ చూప‌లేదు. తెలుగుదేశం పార్టీ మాత్రం లైజ‌నింగ్ చేస్తుంద‌ని  (CBN Strength) ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక వేళ ఎన్డీయే కూట‌మిలో భాగ‌స్వాములుగా చేరితే, టీడీపీ, జ‌న‌సేన హోల్ సేల్ గా మునిగిపోతాయ‌ని స‌ర్వేల సారాంశం. అందుకే, ఆచితూచి అడుగు వేస్తున్నారు. వ్యూహాత్మ‌కంగా వైసీపీ బ‌య‌ట నుంచి బీజేపీకి మ‌ద్ధ‌తు ఇస్తోంది.

Also Read : CBN-CEC : 28న ఢిల్లీకి చంద్రబాబు.. ఓట్ల తొలగింపుపై సీఈసీకి కంప్లైంట్

లిక్క‌ర్ స్కామ్ లో క‌విత‌ను అరెస్ట్ చేయ‌కుండా వ‌దిలేసిన ఎపిసోడ్ నుంచి బీజేపీ గ్రాఫ్ తెలంగాణ‌లో ప‌డిపోయింది. దూకుడుగా వెళుతోన్న బండి సంజ‌య్ ను అధ్య‌క్షునిగా తొల‌గించారు. ఆ రోజు నుంచి బీఆర్ఎస్ పార్టీతో జ‌త క‌ట్టింద‌ని తెలంగాణ స‌మాజం న‌మ్ముతోంది. ఫ‌లితంగా కింగ్ మాట దేవుడెరుగు ఇప్పుడున్న ముగ్గురు ఎమ్మెల్యేల‌నైనా బీజేపీ గెలుచుకుంటుందా? అంటే టీడీపీ మ‌ద్ధ‌తు లేకుండా అసాధ్య‌మ‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని టాక్‌. ఇక ఏపీలో ఉనికి కూడా బీజేపికి ఉండ‌దు. ఒక వేళ టీడీపీతో పొత్తు ఉంటే ఒక‌టి రెండు చోట్ల గెలిచే అవ‌కాశం ఉంది. కానీ, బీజేపీతో ఎవ‌రు పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ మునిగిపోవ‌డం ఖాయ‌మ‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read : CBN High Tech : ట్రిపుల్ ఐటీ ఉత్స‌వాల‌కు చంద్ర‌బాబు, విజ‌న్ 2020 ఫ‌లం

ప్ర‌స్తుతం ఢిల్లీ పీఠం మీద బీజేపీ ఉంది. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఏదో ఆ పార్టీ చేస్తుంద‌ని ప్రాంతీయ పార్టీల భావ‌న‌. తెలుగుదేశం కూడా అలాంటి భావ‌న‌తో ఉంది. అందుకే, వ్యూహాత్మంగా చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. క‌మ‌ల‌నాథుల‌తో క‌లిసి ఉంటూ క‌ల‌వ‌కుండా త‌న‌ప‌ని తాను చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఆయ‌న శిష్యులుగా ఉన్న సీతాద‌యాక‌ర్ రెడ్డి, త‌మ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్నారు. అదే, చంద్ర‌బాబును ఢిల్లీ బీజేపీ పెద్ద‌లు ద‌గ్గ‌ర‌కు తీసుకుని ఉంటే, వాళ్లు అంచ‌నా వేసిన‌ట్టు తెలంగాణ‌లో కింగ్, ఏపీలో కింగ్ మేక‌ర్ గా బీజేపీ ఉండేద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లోని వినికిడి. ఇప్పుడు అలాంటి ప‌రిస్థితి లేదు క‌నుక‌, కింగ్ లేదు కింగ్ మేక‌ర్ లేద‌నే విధంగా బీజేపీ దుస్థితి ఉంద‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.