CBN Plan:ఏపీ జోష్ తెలంగాణ‌కు.!హైద‌రాబాద్ లో టీడీపీ స‌భ‌!

తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం ఆ వేడుక‌ల్ని(CBN Plan) హైద‌రాబాద్ కు తీసుకురానుంది.

  • Written By:
  • Updated On - March 25, 2023 / 01:17 PM IST

తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం సంబురాలు (CBN Plan) చేసుకుంటోంది. ఆ వేడుక‌ల్ని హైద‌రాబాద్ కు తీసుకురానుంది. ఈనెల 29వ తేదీన టీడీపీ ఆవిర్భావ(TDP Formation Day) స‌భ‌ను భాగ్య‌న‌గ‌రం న‌డిబొడ్డున జ‌ర‌ప‌డానికి సిద్ద‌మ‌వుతోంది. ఆ మేర‌కు టీడీపీ తెలంగాణ విభాగం ఇప్ప‌టి నుంచే ఏర్పాట్ల‌ను ముమ్మ‌రం చేసింది. అసెంబ్లీ స‌మీపంలోని నిజాం గ్రౌండ్స్ ను ఆవిర్భావ స‌భ‌కు ముస్తాబు చేస్తోంది. టీడీపీ తెలంగాణ విభాగం అధ్య‌క్షునిగా కాసాని జ్ఞానేశ్వ‌ర్ బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత ఉత్సాహంగా ఉంది. చంద్రబాబు పాల్గొన్న ఖ‌మ్మం స‌భ అనూహ్య విజ‌యాన్ని సాధించింది. అలాంటి స‌భ‌ల‌ను తెలంగాణ వ్యాప్తంగా పెట్టాల‌ని ప్లాన్ చేస్తోంది. ఆ క్ర‌మంలో ఆవిర్భావ స‌భ‌ను హైద‌రాబాద్ కేంద్రంగా నిర్వ‌హించ‌డం ద్వారా ఇరు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ వైభ‌వాన్ని చాట‌బోతుంది.

తెలుగుదేశం పార్టీ ఏపీ విభాగం సంబురాలు (CBN Plan)

ఏపీలో టీడీపీ హ‌వా (CBL Plan)కొన‌సాగుతోంది. స‌భ‌లు ఎక్క‌డ పెట్టినా చంద్ర‌బాబుకు జ‌నం నీరాజ‌నాలు ప‌లుకుతున్నారు. అందుకు నిద‌ర్శ‌నంగా ఆయ‌న పాల్గొన్న స‌భ‌ల విజ‌య‌వంతంతో పాటు వ‌న్ సైడ్ వార్ మాదిరిగా మూడు ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీల‌ను కైవ‌సం చేసుకుంది. తాజాగా ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ స్థానాన్ని చాక‌చ‌క్యంగా గెలుచుకుంది. దీంతో ఫుల్ జోష్ మీద ఉన్న టీడీపీ ఉంది. మ‌ళ్లీ అధికారంలోకి రాబోతున్నామ‌న్న ఉత్సాహం ఉట్టిప‌డుతోంది. యువ‌గ‌ళం పేరుతో లోకేష్ చేస్తోన్న పాద‌యాత్ర విజ‌య‌వంతం అయింది. యువ‌త‌ను ఉత్సాహ‌ప‌రుస్తూ ఆయ‌న చేస్తోన్న యాత్ర పార్టీని మ‌లుపు తిప్పింది. ప‌ట్ట‌భ‌ద్రుల స్థానాల‌ను సునాయాసంగా మూడు ప్రాంతాల్లోనూ టీడీపీ గెలుచుకోవ‌డం యూత్ నాడిని తెలియ‌చేస్తోంది. ఉపాధ్యాయులు, ఉద్యోగులు కూడా చంద్ర‌బాబు ప‌రిపాల‌న అనుభ‌వం గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ ఒంట‌రిగా అధికారంలోకి రావ‌డం ఖాయంగా ఆ పార్టీ శ్రేణుల్లో ఆత్మ‌స్థైర్యం తొణికిస‌లాడుతోంది.

Also Read : TDP : చంద్ర‌బాబు చాణ‌క్యం, ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ కు జ‌ల‌క్!

ఏపీలో మాదిరిగా తెలంగాణ‌లోనూ పార్టీని అధికారం దిశ‌గా (TDP Formation Day)తీసుకెళ్లాల‌ని చంద్ర‌బాబు ప్ర‌ణాళిక‌ను ర‌చించారు. తెలుగుదేశం పార్టీ పొత్తు లేకుండా ఏ పార్టీ తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి సింగిల్ గా రాలేద‌నే సంకేతం బ‌లంగా వెళుతోంది. ఖ‌మ్మం స‌భ సూపర్ హిట్ త‌రువాత టీడీపీ బ‌లం ఏమిటో ప్ర‌త్య‌ర్థుల‌కు తెలిసింది. ఇప్ప‌టి వ‌ర‌కు జాతీయ అధ్య‌క్షునిగా ఏపీ మాత్ర‌మే ఎక్కువ‌గా చంద్ర‌బాబు దృష్టి పెట్టారు. తెలంగాణ‌లో పార్టీ బ‌లోపేతం కోసం పూర్తి స్వేచ్ఛ‌ను కాసానికి ఇచ్చారు. ఆయ‌న జిల్లా, పార్ల‌మెంట్, నియోజ‌క‌వ‌ర్గాల క‌మిటీల‌ను వేస్తూ పార్టీని క్షేత్ర‌స్థాయిలో బ‌లోపేతం చేస్తున్నారు. పున‌ర్వైభ‌వం కోసం వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను కూడ‌గ‌డుతున్నారు. ఇప్ప‌టికే ఆయ‌న బీసీల వ‌ర్గాల‌కు ప్ర‌తినిధిగా ప్ర‌త్యేక గుర్తింపును పొందారు. అంతేకాదు, టీడీపీ వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌కు ఇచ్చిన ప్రాధాన్యం అంద‌రికీ తెలిసిందే. అందుకే, బీసీలను సీఎం చేసే పార్టీగా తెలంగాణ‌లో టీడీపీ(CBN Plan) ఎలివేట్ అవుతోంది.

నిజాం గ్రౌండ్స్ వేదిక‌గా 29న పార్టీ ఆవిర్భావ స‌భ‌

ప్ర‌త్యేక‌వాదాన్ని కింద‌ప‌డేసిన కేసీఆర్ స‌మైక్య‌వాదాన్ని బీఆర్ఎస్ పార్టీ ద్వారా అందుకున్నారు. ఇటీవ‌ల వ‌ర‌కు తెలంగాణ వ్య‌తిరేక పార్టీగా టీడీపీకి ముద్ర‌వేయ‌డం ద్వారా టీఆర్ఎస్ ను బ‌లోపేతం చేసుకున్నారు. ఇప్పుడు ఫ‌క్తు రాజ‌కీయ జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ఏర్ప‌డింది. దీంతో తెలంగాణ వాదం వినిపించ‌డానికి కేసీఆర్ సిద్ధంగా లేరు. అందుకే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ (CBN Plan)తెలుగు వాళ్ల కోసం పుట్టిన పార్టీగా ఫోక‌స్ అవుతోంది. రెండు రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావాల‌ని ప్లాన్ చేస్తోంది. మ‌రోసారి అధికారం కంటిచూపు మేర‌కు ఏపీలో క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో తెలంగాణ‌లో కింగ్ మేక‌ర్ కావాల‌ని ప్ర‌య‌త్నిస్తోంది. ఇటీవ‌ల అండ‌మాన్ నికోబార్ లో గెలిచిన టీడీపీ, బీజేపీ భాగ‌స్వామ్యం తెలంగాణ‌లోనూ ప‌నిచేస్తుంద‌న్న సంకేతం బ‌లంగా వెళ్లింది. ఒక వేళ ఆ పొత్తు కుద‌ర‌క‌పోతే మ‌రో విధంగా చంద్ర‌బాబు వ్యూహాన్ని ర‌చిస్తున్నార‌ని తెలుస్తోంది. అందుకే, నిజాం గ్రౌండ్స్ వేదిక‌గా(TDP Formation Day) ఈనెల 29న పార్టీ ఆవిర్భావ స‌భ‌ల‌ను పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌డానికి స‌న్న‌ద్ధం అయ్యారు. తెలంగాణ‌లో పుట్టిన పార్టీగా సంకేతాలు ఇస్తూ తెలుగు వాళ్ల కోసం ప‌నిచేస్తుంద‌న్న వాదాన్ని ప్ర‌జాక్షేత్రంలోకి తీసుకెళ్ల‌నున్నారు.

Also Read : CBN Vision : చంద్ర‌బాబు జీవితం మ‌లుపు, ఇందిరాగాంధీ మైమ‌ర‌పు!