Site icon HashtagU Telugu

CBI case against Megha : ‘మేఘా’ ఫై సీబీఐ కేసు నమోదు..

Cbi Case Against Megha Engi

Cbi Case Against Megha Engi

మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ( Megha Engineering and Infrastructures Ltd (MEIL)) ఫై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్ఐఎస్‌పీకి చెందిన రూ.315 కోట్ల ప్రాజెక్టులో అవినీతికి పాల్పడ్డారనే అభియోగాలపై మేఘతో పాటు కేంద్ర ఉక్కు శాఖకు చెందిన ఎనిమిది మంది అధికారులపై సీబీఐ కేసు నమోదు చేసింది. కేసు నమోదైన అధికారులంతా కేంద్ర ఉక్కుశాఖ పరిధిలోని ఎన్ఎండీసీ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంటుకు చెందిన అధికారులు కావడం గమనార్హం.

We’re now on WhatsApp. Click to Join.

మేఘా ఇంజినీరింగ్ సంస్థకు ఓ కాంట్రాక్టుకు సంబంధించిన పేమెంట్ చేసే విషయంలో ఎన్ఎండీసీకి చెందిన ఎనిమిది మంది అధికారులు, ప్రభుత్వ రంగ సంస్థ మెకాన్ లిమిటెడ్‌కు చెందిన ఇద్దరు అధికారులు లంచం పుచ్చుకున్నారని అందిన ఫిర్యాదు మేరకు సీబీఐ కేసు నమోదు చేసింది. U/s 120బీ ఐపీసీ r/w ఐపీసీ 465, సెక్షన్ 7 8 &9 కింద సీబీఐ కేసు నమోదు చేసింది.

ఇదిలా ఉంటె మార్చి 21న ఎన్నికల సంఘం విడుదల చేసిన డేటా ప్రకారం మెఘా ఇంజినీరింగ్ ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలుదారుగా రెండవ స్థానంలో నిలిచింది. బాండ్ల రూపంలో అత్యధికంగా బీజేపీకి సుమారు రూ.586 కోట్లను విరాళంగా ఇచ్చినట్టు పేర్కొంది. ఇదే కంపెనీ బీఆర్‌ఎస్‌కు రూ.195 కోట్లు, డీఎంకేకు రూ.85 కోట్లు, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీకి రూ.37 కోట్లు, టీడీపీకి దాదాపు రూ.25 కోట్లు ఇవ్వగా.. కాంగ్రెస్‌కు రూ.17 కోట్లు, జేడీఎస్, జనసేన, జేడీయూకు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్లు విరాళంగా ఇచ్చినట్టు ఎన్నికల సంఘం తెలిపింది.

Read Also : Danam Land Grab: దానం భూకబ్జా వెనుక సీఎం రేవంత్: కేటీఆర్