Castes Census : నేటి నుంచి రాష్ట్రంలో కులగణన సర్వే ప్రారంభం కానుంది. గతంలో ఈ సర్వేలో పాల్గొనని వారు తమ వివరాలను నమోదు చేసుకోవడానికి మరోసారి అవకాశం కల్పించబడింది. ఈ సర్వే ఈ నెల 28 వరకు కొనసాగుతుంది. మూడు విధాలుగా ప్రజలు తమ వివరాలను నమోదు చేసుకోవచ్చు. మొదటగా, టోల్ ఫ్రీ నంబర్ 040-21111111 కు కాల్ చేసి, ఎన్యూమరేటర్లను ఇంటికి పిలిపించుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కాల్ చేసి, తమ అడ్రస్ ఇచ్చినట్లయితే ఎన్యూమరేటర్లు ఇంటికి వచ్చి వివరాలు నమోదు చేస్తారు. రెండవ ఆప్షన్‌గా, ఆన్‌లైన్ ద్వారా ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకుని seepcsurvey.cgg.gov.in వెబ్‌సైట్‌లో అవసరమైన వివరాలను నింపి, ప్రజాపాలన సేవా కేంద్రాల్లో (CSC) సమర్పించవచ్చు. మూడవ ఆప్షన్‌గా, నేరుగా మండల పరిషత్ కార్యాలయాలకు వెళ్లి వివరాలు నమోదు చేసుకోవచ్చు.
Jayalalitha Properties : జయలలిత వేల కోట్ల ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..!!
ఈ సర్వేను మార్చి మొదటి వారంలో కులగణన చట్టబద్ధత కల్పించడానికి, బీసీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని ఉద్దేశించి నిర్వహిస్తున్నారు. గతంలో నిర్వహించిన సర్వేలో 1.15 కోట్ల కుటుంబాలు గుర్తించబడ్డాయి. 96.9 శాతం జనాభా సర్వేలో పాల్గొన్నప్పటికీ, 3.1 శాతం జనాభా పాల్గొనలేదు. ఈ 3.56 లక్షల కుటుంబాల్లో దాదాపు 16 లక్షల మంది ఉంటారని అంచనా వేయబడింది. సర్వేలో పాల్గొనని వారు , మిగిలిన వారందరికీ ప్రభుత్వం ఇప్పుడు మరొక అవకాశం కల్పించింది.
మునుపటి సర్వేలో కొన్ని కీలక బీఆర్ఎస్ నేతలు పాల్గొనలేదు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి తదితరులు తమ వివరాలు నమోదు చేయలేదు. ఇప్పుడు నిర్వహించే సర్వేలో వీళ్లు పాల్గొంటారా అనే ప్రశ్న ఉత్పన్నమైంది. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత , ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గత సర్వేలో తమ వివరాలు నమోదు చేసుకున్నారు.
ఈ సర్వే నిర్వహణ కోసం, శనివారం హైదరాబాద్ లోని ఈఎంఆర్ఐ సెంటర్ లో కాల్ సెంటర్ ఆపరేటర్లకు అవగాహన కల్పించారు. కాల్ చేసినవారి పూర్తి వివరాలు తీసుకోవాలని, మొబైల్ నంబర్ ద్వారా పాత డేటా చెక్ చేసి, అవసరమైన ఇతర వివరాలు (పేరు, అడ్రస్, పిన్ కోడ్, మండల పరిషత్, గ్రామం, జిల్లా) సేకరించి సంబంధిత జిల్లా కలెక్టర్లకు పంపించాలని సూచించారు.
Ram Charan : చరణ్ తో మూవీ చేయడం లేదు..డైరెక్టర్ ఫుల్ క్లారిటీ