Site icon HashtagU Telugu

KTR – Gorati Venkanna Interview : కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూపై కేసు నమోదు

Case Registered On Ktr Gora

Case Registered On Ktr Gora

హైదరాబాద్ అమరవీరుల స్మారక ప్రాంగణంలో కేటీఆర్, గోరటి వెంకన్న ఇంటర్వ్యూ (KTR – Gorati Venkanna Interview) ఫై పోలీసులు కేసు (Police Case) నమోదు చేసారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మంత్రి కేటీఆర్ ఏ ఫ్లాట్ ఫామ్ ను వదిలిపెట్టకుండా ఇంటర్వూస్ ఇస్తూ వస్తున్నారు. ఆ మధ్య My village show యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చి వార్తల్లో నిలువగా..ఆ తర్వాత వరుసగా న్యూస్ చానెల్స్ లలో ఇంటర్వూస్ ఇస్తూ వస్తున్నారు.

తాజాగా కేటీఆర్, ఎమ్మెల్సీ, కవి గోరటి వెంకన్న లు ఇద్దరు కలిసి అమరవీరుల స్మారక ప్రాంగణంలో ఇంటర్వ్యూ చేసారు. దాదాపు అన్ని న్యూస్ చానళ్లలో, యూట్యూబ్ చానళ్లలో ప్రసారమైంది. అయితే, ఈ ఇంటర్వ్యూపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఇంటర్వ్యూని సీరియస్‌గా తీసుకున్న ఈసీ.. చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. దీంతో ఇంటర్వ్యూ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.

We’re now on WhatsApp. Click to Join.

కొత్త సచివాలయం, అంబేద్కర్ విగ్రహం కనపడేలా షూటింగ్ చేశారని, దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు. కేటీఆర్ ఇంటర్వ్యూను డ్రోన్‌లతో తీశారని, దీనికి పోలీసులు పర్మిషన్ ఎలా ఇచ్చారని కాంగ్రెస్ నేత జి. నిరంజన్ ఇటీవల ప్రశ్నించారు. ఇక ఇంటర్వ్యూ లో తొమ్మిదన్నరేళ్లలో తెలంగాణ చేసిన అభివృద్ధి ఏంటి.. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు ఇలా పలు అంశాలపై మాట్లాడారు.

Read Also : Telangana: మూడ్రోజులపాటు తెలంగాణలో ప్రియాంక పర్యటన