Site icon HashtagU Telugu

YouTuber Harsha Sai: హర్ష సాయిపై కేసు.. ఇతడు ఎవరు ? ఎందుకీ కేసు ?

Youtuber Harsha Sai Vc Sajjanar Telangana Hyderabad Police

YouTuber Harsha Sai: ప్రముఖ తెలుగు యూట్యూబర్ హర్షసాయి‌పై హైదరాబాద్‌లోని సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నందుకు ఈ కేసు నమోదైంది. ఎంతో మంది అమాయ‌కులు ఆన్‌లైన్ బెట్టింగ్‌ బారినపడి బికారీలుగా మారుతున్నారు. అయినా కేవలం డబ్బు సంపాదించడమే లక్ష్యంగా హర్షసాయి‌ బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నాడు. ఈవిధంగా బెట్టింగ్  యాప్‌లను ప్రమోట్ చేసే సోషల్ మీడియా ఇ‌న్‌ప్లూయెన్స‌ర్ల‌ను, యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్లను నెటిజన్లు అన్‌ఫాలో చేయాల్సిన అవసరం ఉంది. అలాంటి వారి సోషల్ మీడియా అకౌంట్లను రిపోర్ట్ చేయాలి.

Also Read :Gadkari Vs Caste Politics: కుల, మత రాజకీయాలకు నేను వ్యతిరేకం.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు

ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కీలక వ్యాఖ్యలు

హర్షసాయిపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తాను ఎవరిపైనా వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని సజ్జనార్ తెలిపారు. బెట్టింగ్ యాప్‌లను ప్రోత్సహిస్తూ పబ్బం గడుపుకుంటున్న సోషల్ మీడియా ఇన్‌ ఫ్లూయెన్సర్లతో మాత్రమే పోరాడుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.  హర్షసాయి(YouTuber Harsha Sai) లాంటి కంటెంట్ క్రియేటర్లు  తమను అనుసరిస్తున్న లక్షలాది మంది నెటిజన్లను తప్పుదారి పట్టిస్తున్నారని సజ్జనార్ మండిపడ్డారు. దయచేసి హర్షసాయి లాంటి ఇన్ ఫ్లూయెన్సర్ల మాటలను, ప్రమోషన్లను నమ్మొద్దని ఆయన కోరారు. ప్రజల జీవితాలు, వారి భవిష్యత్తు, కుటుంబ శ్రేయస్సు, సమాజ నిర్మాణం బాగుండాలంటే బెట్టింగ్ తరహా వ్యసనాలను నిర్మూలించాల్సిన అవసరం ఉందన్నారు.

హర్షసాయి గురించి..