తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఫై కేసు నమోదైంది. మాజీ సీఎం , బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఫై అనుచిత వ్యాఖ్యలు చేసారని చెప్పి బిఆర్ఎస్ నేతలు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు పెట్టారు. ప్రస్తుతం బిఆర్ఎస్ vs కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. మొన్నటి వరకు రుణమాఫీ ఫై ఇరు పార్టీల నేతలు ఒకరి ఫై ఒకరు విమర్శలు , ఆరోపణలు చేసుకోగా..అది కాస్త చల్లారగానే..తెలంగాణ సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుండగా..బిఆర్ఎస్ పార్టీ విగ్రహం పెట్టొద్దంటూ హెచ్చరిస్తుంది. ఒకవేళ పెడితే తమ ప్రభుత్వం రాగానే కూల్చేస్తామని తెలిపింది. దీనిపై సీఎం రేవంత్ కాస్త ఘాటుగానే రియాక్ట్ అయ్యారు.
We’re now on WhatsApp. Click to Join.
నిన్న రాజీవ్ గాంధీ జయంతి వేడుకల సందర్:గా ఏర్పాటు చేసిన సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేసీఆర్ లో ఏ మాత్రం అహంకారం తగ్గలేదని..అధికారం లేకపోయినా ఒంట్లో బలుపు మాత్రం అలాగే ఉందని వ్యాఖ్యానించారు. తెలంగాణ సచివాలయం ముందర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు ను వ్యతిరేకిస్తున్న కేసీఆర్ చనిపోయాక ఆయన విగ్రహం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాడు కేటీఆర్ అంటూ వ్యాఖ్యలు చేశారు. కోట్ల స్కాములు చేసిన కేసీఆర్ విగ్రహం ఏర్పాటు చేసి సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నట్లు అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బిఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ ఫై కేసు పెట్టారు.
Read Also : Dengue fever in Telangana : తెలంగాణలో విజృభిస్తున్న డెంగ్యూ ..నిన్న ఒక్క రోజే ఐదుగురు మృతి