KMC Ragging : ఏడుగురు మెడికోలపై కేసు నమోదు

గతంలో పలుమార్లు ర్యాగింగ్‌ ఘటనలు వార్తల్లో నిలువగా..మరోసారి ర్యాగింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 14న KMC ఆవరణలో బర్త్‌డే వేడుకల్లో సీనియర్స్ , జూనియర్స్ కు మధ్య తలెత్తిన వివాదం కొట్టుకునేవరకు వెళ్లింది.

  • Written By:
  • Publish Date - September 19, 2023 / 09:02 PM IST

మరోసారి కాకతీయ మెడికల్‌ కాలేజీ(kakateeya medical college)లో ర్యాగింగ్‌ కలకలం రేపింది. గతంలో పలుమార్లు ర్యాగింగ్‌ ఘటనలు వార్తల్లో నిలువగా..మరోసారి ర్యాగింగ్‌ ఘటన చోటుచేసుకుంది. ఈ నెల 14న KMC ఆవరణలో బర్త్‌డే వేడుకల్లో సీనియర్స్ , జూనియర్స్ కు మధ్య తలెత్తిన వివాదం కొట్టుకునేవరకు వెళ్లింది. ఫస్ట్ ఇయర్‌ స్టూడెంట్‌పై విచక్షణా రహితంగా సీనియర్ల దాడి చేయడం తో మట్వాడా పోలీసులతో పాటు UGCకి బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఏడుగురు మెడికోలపై IPC 294-B, ర్యాగింగ్‌ నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు.

ఇటీవల గాంధీ మెడికల్ కాలేజీ(Gandhi Medical College)లోనూ ర్యాగింగ్ భూతం కలకలం రేపింది. ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను కొందరు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ఈ విషయాన్ని ఆ బాధిత విద్యార్థులు కాలేజీ యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లారు. ర్యాగింగ్‌కు పాల్పడిన సీనియర్లపై చర్యలు తీసుకోవాలని ఢిల్లీ యూజీసీ యాంటీ ర్యాగింగ్‌ కమిటీకు కూడా ఫిర్యాదు చేశారు. దీంతో.. ఈ విషయాన్ని తీవ్రంగా కమిటీ.. ఘటనపై విచారణ జరిపింది. ఈ విచారణలో 10 మంది సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో ఆ 10 మంది విద్యార్థులను ఏడాది పాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ ఘటన ఇంకా మరచిపోకముందే ఇప్పుడు KMC లో ర్యాగింగ్‌ ఘటన వార్తల్లోకి నిలిచింది.

Read Also : Women’s Reservation Bill: ప్రజా జీవితంలోకి వచ్చేందుకు మహిళలకు మంచి అవకాశం