ఒకప్పుడు తన మాట తీరుతో అందరి చేత నవ్వులు తెప్పించిన బిత్తిరి సత్తి (Bithiri Sathi)..ఇటీవల వరుస వివాదాల్లో చిక్కుంటున్నాడు. తాజాగా భగవద్గీత (Bhagavad Gita )ను కించపరచేలా వీడియో చేశాడని బిత్తిరి సత్తిపై రాష్ట్రీయ వానరసేన ఫిర్యాదు చేసింది. గతంలో టీవీ షోస్ తో ఎంతో పాపులర్ అయినా సత్తి..ఆ తర్వాత పలు సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో కనిపించి అలరించాడు. ఆ తర్వాత సినిమా ప్రమోషన్ లలో కూడా కనిపించాడు. అంతే కాదు సోషల్ మీడియా లో నిత్యం పలు వీడియోస్ తో నెటిజనాలను అలరిస్తూ వస్తున్నాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ క్రమంలో తాజాగా తన ఇన్ స్టాగ్రాంలో ఓ వీడియో పెట్టారు బిత్తిరి సత్తి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధ చేసిన స్టైల్‌లో.. స్నేహితుల స్వభావం గురించి ఓ శ్లోకాన్ని దాని తాత్పర్యాన్ని వివరిస్తూ వీడియో పోస్ట్ చేశారు. అది కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో ఫై నెటిజన్లతో పాటు హిందూ సంఘాలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్తి వెంటనే ఈ వీడియోను తొలగించి హిందువులకు క్షమాపణ చెప్పాలని హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై సైబర్ క్రైమ్ పోలీసులకి వానర సేన అనే హిందూ సంఘం ఫిర్యాదు పిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నాయి.
Read Also : AP Cabinet Meeting Key Decisions : ఏపీ కేబినెట్ తీసుకున్న కీలక నిర్ణయాలు