Hyderabad: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు కారు భీభత్సం

మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడిపై కేసు నమోదైంది. మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరిని గాయపరిచినందుకు గాను ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడుపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

Hyderabad: మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడిపై కేసు నమోదైంది. మద్యం మత్తులో కారు నడుపుతూ ఇద్దరిని గాయపరిచినందుకు గాను ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడుపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు.

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఫోరం మాల్‌ సర్కిల్‌ సమీపంలో ఆదివారం తెల్లవారుజామున హోండా సిటీ కారు నడుపుతున్న అల్లోల అగ్రజరెడ్డి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. మరో ఇద్దరు స్నేహితులతో కలిసి గచ్చిబౌలిలోని ఒక పబ్‌లో పార్టీ చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రాంగ్ రూట్‌లో కారు నడుపుతున్నాడు. కూకట్‌పల్లి అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌ శివ భాస్కర్‌ మాట్లాడుతూ..అయితే ప్రమాదం జరిగిన సమయంలో అతను కారు నడపడం లేదని చెప్పినట్టు చెప్పారు.

పోలీసులు గట్టిగ ప్రశ్నించడం ముగ్గురు యువకులు ఒకరినొకరు నిందించుకున్నారు. సీసీటీవీ ఫుటేజీ మరియు ఇతర ఆధారాలతో అగ్రజరెడ్డినే వాహనాన్ని నడుపుతున్నట్లు ప్రాథమికంగా నిర్థారణ అయిందని ఆయన చెప్పారు. బ్రీత్ ఎనలైజర్ పరీక్షలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మద్యం సేవించినట్లు తేలింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించామని, వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.

ప్రమాదంలో గాయపడిన వ్యక్తులు రాజస్థాన్‌కు చెందిన బన్వర్‌లాల్ (24), ధురుచంద్ (33)గా గుర్తించారు. సినిమా చూసి ఇంటికి తిరిగి వస్తున్నారు. అగ్రజరెడ్డిపై ర్యాష్ అండ్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేశారు. సిఆర్‌పిసి సెక్షన్ 41 కింద అగ్రజరెడ్డికి పోలీసులు నోటీసు జారీ చేశారు, విచారణ కోసం తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు.

Also Read: Animal Party: వైరల్ అవుతున్న యానిమల్ సక్సెస్ పార్టీ