Site icon HashtagU Telugu

Group 1 Exam : గ్రూప్ 1 అభ్యర్థుల ఆర్తనాదాలు వినిపించడం లేదా..రాహుల్ ..? – హరీష్ రావు

Harishraocng

Harishraocng

ఎన్నికల ముందు అశోక్ నగర్ లో తిరిగిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) ప్రశ్నించారు. ‘గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు వారికి వినిపించడం లేదా? రాహుల్ గాంధీ (Rahul Gandhi) తప్పకుండా స్పందించాలి. అందరికీ న్యాయం చేయాలని KCR తెచ్చిన GO 55ను ఎందుకు రద్దు చేశారు? GO 29తో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల అభ్యర్థులకు అన్యాయం జరుగుతోంది. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు.

గ్రూప్‌-1 పరీక్ష (Group 1 Exam) రీ షెడ్యూల్‌ చేయాలని కోరుతూ అశోక్ నగర్ (Ashok Nagar) లో అభ్యర్థులు నిరసన చేస్తున్న విషయం తెలిసిందే. రెండు రోజులుగా ఆందోళనలు తీవ్రతరం చేశారు. మొన్న రాత్రికి కూడా ధర్నా చేయడం తో పోలీసులు చాలామందిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న కూడా అలాగే డిమాండ్ చేస్తూ రోడ్లపైకి చేరుకుని నినాదాలు చేస్తు ర్యాలీ చేపట్టారు. ప్లకార్డులతో రోడ్లపైకి వచ్చిన 16 మందిని పోలీసులు అరెస్టు చేసి బేగంబజార్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఆందోళనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు లాఠీ ఛార్జి చేయడంతో పలువురికి గాయాలయ్యాయి. వందల సంఖ్యలో చేరుకున్న అభ్యర్ధులు గతంలో జరిగిన ప్రిలిమ్స్ పరీక్షల్లో తప్పులు, జీవో 29 సవరించిన తర్వాతే పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ తరుణంలో దీనిపై హరీష్ రావు స్పందించారు. జీవో 29 వ‌ల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభ్య‌ర్థుల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌న్నారు. నిరుద్యోగుల ఎజెండా మా ఎజెండా అని ప్ర‌గ‌ల్భాలు ప‌లికిన కోదండ‌రాం, రియాజ్, చింత‌పండు న‌వీన్, ఆకునూరి ముర‌ళీ ఎక్క‌డున్నార‌ని హ‌రీశ్‌రావు ప్ర‌శ్నించారు. GO 55, బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ వర్గాలకు విద్య, ఉపాధి రంగాలలో న్యాయం చేయడానికి తీసుకొచ్చిన ప్రభుత్వ ఉత్తర్వు (GO) అని హరీశ్ రావు స్పష్టం చేశారు. ఇది సాంఘిక న్యాయానికి అనుగుణంగా ఉన్న చర్యగా కేసీఆర్ ప్రభుత్వం దీనిని తీసుకొచ్చినప్పటికీ, కాంగ్రెస్ రద్దు చేయడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు.

GO 29 ద్వారా విద్యా మరియు ఉద్యోగ అవకాశాల్లో వెనుకబడిన వర్గాల మీద నష్టకరమైన ప్రభావం చూపుతున్నారని హరీశ్ రావు అన్నారు. దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రూప్ -1 వాయిదా వేయాల‌ని అభ్య‌ర్థులు ఆందోళ‌న చేస్తుంటే.. కోదండరాం ఎందుకు మౌనంగా అంటున్నారు. నిరుద్యోగుల ఎజెండా నా ఎజెండా అన్నారు. ఎమ్మెల్సీ అయ్యాకా గొంతు మూగబోయింది. కోదండరాం, రియాజ్, చింతపండు నవీన్, ఆకునూరి మురళీ ఎక్కడున్నారు. అశోక్ నగర్ వెళ్లండి.. గ్రూప్-1 అభ్య‌ర్థుల‌తో చర్చించండి. నిరుద్యోగులకు మోసం చేసి, ఉద్యోగాలు పొందిన ఈ నలుగురు ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని హ‌రీశ్‌రావు ధ్వ‌జ‌మెత్తారు.

Read Also : Vikash Yadav : ఉగ్రవాది పన్నూ హత్యకు కుట్రకేసు.. ‘రా’ మాజీ అధికారి వికాస్ అరెస్టు !