ఎన్నికల ప్రచారానికి (Campaign ) శుభం కార్డు పడే సమయం వచ్చేసింది..మరికొద్ది గంటల్లో అన్ని మైకులు మూగబోనున్నాయి. ఈ క్రమంలో ఉన్న ఈ కొద్దీ గంటల్లో ఓటర్లను మరింతగా ఆకట్టుకునేందుకు అన్ని పార్టీల నేతలు (All Party Leaders) ట్రై చేస్తున్నారు. ముందునుండి దూకుడు మీద ఉన్న కాంగ్రెస్ (Congress) , బిఆర్ఎస్ (BRS) పార్టీల నేతలు చివరి రోజున తమ ప్రసంగాలతో , రోడ్ షో లతో హోరెత్తించబోతున్నారు.
జూబ్లీహిల్స్ ఆటో వర్కర్స్, జిహెచ్ఎంసి, గిగ్ వర్కర్స్ యూనియన్లతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమావేశం కానున్నారు. అనంతరం నాంపల్లి నియోజకవర్గంలో రోడ్ షో నిర్వహించి కార్నర్ సమావేశంలో ప్రసంగిస్తారు. ప్రియాంక గాంధీ జహీరాబాద్ నియోజకవర్గ ఎన్నికల సభలో పాల్గొని ప్రచారం చేస్తారు. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు అగ్రనాయకులు కలిసికట్టుగా హైదరాబాద్ నగరంలో రోడ్ షో నిర్వహించాలని యోచిస్తున్నారు. కంటోన్మెంట్, ఉప్పల్, కుత్బుల్లాపూర్, మల్కాజ్గిరి నియోజకవర్గాలల్లో రోడ్ షోలో పాల్గొని కార్నర్ సమావేశంలో మాట్లాడనున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
సిరిసిల్ల బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి కేటీఆర్ సిరిసిల్లకు రానున్నారు. కామారెడ్డి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకొని మధ్యాహ్నం రెండు గంటలకు సిరిసిల్ల పట్టణానికి చేరుకుంటారు. మధ్యాహ్నం రెండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పట్టణంలో నిర్వహించే రోడ్ షోలో పాల్గొంటారు. గజ్వేల్, వరంగల్ లో సీఎం కేసీఆర్ ప్రచారం చేయనున్నారు.
బీజేపీ విషయానికి వస్తే పార్టీ పెద్దలంతా చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మహారాష్ట్ర సీఎం, డిప్యూటీ సీఎం, కేంద్ర మంత్రులు సాద్వి నిరంజన్, భగవత్ కిషన్ రావు లు ప్రచారం చేయనున్నారు. ఇక ఏ పార్టీ నేతలు ఏం చేసినా సాయంత్రం 5 వరకే చేయాలి. ఆ తర్వాత ఏ నేతా లేదా స్టార్ క్యాంపెనర్లు ఎవ్వరూ కూడా ఎన్నికల ప్రచారం చేయకూడదు. మీడియాతో, ప్రెస్ కాన్ఫరెన్స్‌లు కూడా నిర్వహించకూడదని ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు జారీ చేసింది.
Read Also : BRS Master Plan : ప్రచార చివరి రోజున బిఆర్ఎస్ మాస్టర్ ప్లాన్ వేసింది
