Site icon HashtagU Telugu

CAG Report : తెలంగాణ అసెంబ్లీ ముందుకు కాగ్‌ రిపోర్ట్‌..

CAG Report before Telangana Assembly..

CAG Report before Telangana Assembly..

CAG Report : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ఈరోజు తొమ్మిదవ రోజుకు చేరుకున్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాలు చివర రోజు కావడంతో మూడు బిల్లులపై చర్చ కొనసాగుతుంది. మొదటగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సివిల్ కోర్టుల సవరణ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. అనంతరం సీతక్క వీడియో మార్ఫింగ్ అంశంపై సభలో చర్చ కొనసాగింది. అనంతరం అసెంబ్లీలో కాగ్ నివేదికను ప్రవేశ పెట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ రిపోర్ట్ ను అసెంబ్లీలో ముందుకు వచ్చింది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయంలో ఎక్కువగా ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పై గత ఐదేళ్లలో ఎక్కువ ఖర్చులు ఉన్నాయని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరంపై చేశారన్నారు. 1983- 2018 మధ్య కాలంలో 20సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం ప్రారంభం అయితే వాటి పై 1.73లక్షల కోట్లు కాగా.. మొదటి అంచాన వ్యయం 1లక్ష కోట్లు నుండి.. 2లక్షల కోట్లకు పెరిగిందని తెలిపింది. ద్రవ్యలోటు పరిమితులకు లోబడి ఉందన్నారు. ఇచ్చిన రుణాలు అడ్వాన్సులు భారీగా ఉన్నాయని, వాటా అత్యధికంగా ఉన్నాయని పేర్కొంది. కాళేశ్వరం మిషన్ భగీరథ కే ఎక్కువ రుణాలు.. తీసుకున్న రుణాలు.. చెల్లించడానికే ఎక్కువ ఖర్చులు. కార్పొరేషన్ల పేరుతో తీసుకున్న రుణాలను మళ్ళీ చెల్లించడానికి.. బడ్జెట్ యేతర రుణాలను తిరిగి చెల్లించడానికి ఇబ్బంది ఎర్పడిందన్నారు. గత ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం నిర్దేశించిన పరిమితి కన్నా 6శాతం ఎక్కువ రుణాలు తీసుకున్నారని తెలిపింది. గత సంవత్సరం బడ్జెట్ లో పన్నెత్తర రాబడి అంచనాలు ఎక్కువగా వేశారన్నారు. ఎస్సీ అభివృద్ధి నిధుల్లో 58 శాతం, ఎస్టిలో నిధుల్లో 38శాతం వినియోగం కాలేదన్నారు. ఖర్చు అయిన ఎస్సి, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధులను దారిమల్లించారని కాగ్ నివేదిక లో వెల్లడించారు.

Read Also: BRS MLA U-Turn: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే యూటర్న్, రేవంత్ ను కలిసిన కృష్ణమోహన్ రెడ్డి