Site icon HashtagU Telugu

TPCC President: కేబినెట్ విస్త‌ర‌ణ నా ప‌రిధిలో లేదు: టీపీసీసీ అధ్య‌క్షులు

TPCC President

TPCC President

TPCC President: టీపీసీసీ అధ్య‌క్షులు (TPCC President) మ‌హేష్ కుమార్ గౌడ్ మ‌రోసారి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. మీడియాతో చిట్ చాట్‌లో కేబినెట్ విస్తరణ అంశాన్ని ప్రస్తావించలేదని స్ప‌ష్టం చేశారు. కేబినెట్ విస్తరణ త‌న‌ పరిధిలో లేదని.. ముఖ్యమంత్రి రేవంత్‌, ఏఐసీసీ కేబినెట్ విస్త‌ర‌ణ‌ను పరిశీలిస్తోందని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. కార్పొరేషన్లు, బోర్డులు, కమిషన్లు చైర్మన్లు, డైరెక్టర్లు, సభ్యుల నియకాలను ముఖ్యమంత్రి, ప్రభుత్వం త్వరలో ప్రకటించడానికి కసరత్తు చేస్తోందన్నారు. పార్టీ కార్యవర్గాన్ని ఈ నెలాఖరులోగా నాయకులతో అభిప్రాయాలు తీసుకుని త్వరలో నియమించడం జరుగుతుందన్నారు.

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీకి పోటీ చేస్తామ‌న్నారు. నియోజకవర్గం పరిధిలో ఆయా జిల్లాల నుంచి నలుగురు, ఐదుగురు టికెట్ ఆశిస్తున్నారని టీపీసీసీ మహేష్ కుమార్ తెలిపారు. ఆ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎంపీలు, డీసీసీల నాయకుల అభిప్రాయాలు తీసుకుని నిర్ణయం తీసుకుంటామ‌న్నారు. వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని తుది నివేదిక అధిస్థానానికి అందజేస్తామని వెల్ల‌డించారు. టీచర్స్ ఎమ్మెల్సీ విషయంలో ఎవరికి మద్దతు ఇవ్వాలన్న అంశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్, ముఖ్యమంత్రి, మంత్రుల అభిప్రాయం తీసుకుంటామ‌ని అన్నారు. అయితే కొంద‌రు కావాల‌నే కేబినెట్ విస్త‌ర‌ణ గురించి, ఎమ్మెల్సీల పేర్ల‌ను తాను ప్రస్తావించిన‌ట్లు వార్త‌లు రాశార‌ని టీపీసీసీ అధ్య‌క్షులు తెలిపారు. అవాస్త‌వాల‌ను రాయొద్ద‌ని ఆయ‌న కోరారు.

Also Read: Saraswati Pushkaras: మే 15 నుండి 26 వరకు సరస్వతీ పుష్కరాలు

కేబినెట్ విస్త‌ర‌ణ‌?

తెలంగాణ కేబినెట్ విస్త‌ర‌ణ గురించి సోష‌ల్ మీడియాలో ర‌క‌ర‌కాల వార్త‌లు వ‌స్తున్నాయి. అయితే కొన్ని నివేదిక‌ల ప్ర‌కారం.. ఈ సంక్రాంతి త‌ర్వాత కేబినెట్‌లోకి కొత్త మంత్రులు వ‌స్తార‌ని తెలుస్తోంది. అయితే ఆయా సామాజిక వ‌ర్గాల ఆధారంగా కొత్త వారికి కేబినెట్‌లో అవ‌కాశం ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అయితే ఈనెల 15వ తేదీన ఈ విష‌య‌మై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్‌, మిగిలిన మంత్రులు చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. అదేవిధంగా జ‌న‌వ‌రి 26 నుంచి అమ‌లు చేయ‌బోయే ప‌థకాల గురించి ఏఐసీసీకి సీఎం, మంత్రులు చెప్ప‌నున్నారు.