Site icon HashtagU Telugu

New Ministers : మంత్రివర్గ విస్తరణ.. ఏప్రిల్‌ 3న కొత్త మంత్రుల ప్రమాణం ?

Telangana New Ministers Cabinet Expansion

New Ministers :  తెలంగాణలో మంత్రివర్గ విస్తరణపై మరో కీలక అప్‌డేట్ వచ్చింది. కొత్త మంత్రులు ఎవరు ? అనేది ఉగాది (మార్చి 30)కల్లా తేలిపోనుంది. మినిస్టర్లుగా ఛాన్స్ పొందేవారు ఏప్రిల్ 3న(గురువారం) ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రెడ్డి వర్గం నుంచి  సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి కోసం ముమ్మరంగా ట్రై చేస్తున్నారు. వీరిలో ఒకరికి మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీసీ వర్గం నుంచి  శ్రీహరి ముదిరాజ్‌, ఆది శ్రీనివాస్‌‌లలో ఒకరికి మంత్రి పదవి దక్కొచ్చు. ఎస్సీ వర్గం నుంచి ఎమ్మెల్యే వివేక్‌కు మంత్రి పదవి దక్కొచ్చు.

Also Read :Bollywood To Tollywood : టాలీవుడ్‌‌‌కు వచ్చేస్తా.. ఎందుకో చెప్పిన సన్నీ దేవల్

గ్రేటర్ ఎన్నికలపై ఫోకస్.. మైనారిటీలకు అవకాశం ? 

త్వరలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ఉన్నాయి. ఈనేపథ్యంలో ముస్లిం మైనారిటీల నుంచి ఒకరికి మంత్రివర్గంలో చోటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ దిశగా కాంగ్రెస్ పెద్దలు ఆలోచిస్తే ఎమ్మెల్సీ అమీర్‌ అలీఖాన్‌కు మంత్రి(New Ministers) పదవి దక్కొచ్చు. మంత్రివర్గం కూర్పుపై తెలంగాణ రాష్ట్ర కోర్‌ కమిటీ నుంచి ఏఐసీసీ పెద్దలు ఇప్పటికే వివరాలను సేకరించారు. దీనిపై సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించారు. ఎస్టీ వర్గం నుంచి ఒకరికి డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తారనే టాక్ వినిపిస్తోంది.

Also Read :Indians On Hold : ‘కస్టమర్ కేర్’ హారర్.. ఏడాదిలో 1500 కోట్ల గంటలు హోల్డ్‌లోనే

హోంమంత్రి పదవి అంటే ఇష్టం : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 

తనకు హోంమంత్రి పదవి అంటే ఇష్టమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. మంత్రి పదవి విషయంలో తనకు ఢిల్లీ నుంచి ఇంకా ఫోన్ రాలేదని ఆయన తెలిపారు. తనకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందనే ఆశాభావంతో ఉన్నట్లు వెల్లడించారు. ‘‘నేను సమర్ధుడిని .. అందుకే నాకు మంత్రి పదవి దక్కొచ్చు’’ అని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ‘‘గతంలో భువనగిరి ఎంపీ పదవిని నేను సమర్ధవంతంగా నిర్వహించాను’’ అని ఆయన గుర్తు చేశారు. ‘‘నాకు ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా సమర్ధవంతంగానే నిర్వహిస్తాను.. దీనిలో ఎలాంటి సందేహం లేదు. పదవులు ఉన్నా లేకపోయినా నేను ప్రజల పక్షానే నిలబడతాను’’ అని రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు.