తెలంగాణ 2025-26 ఆర్థిక సంవత్సర బడ్జెట్(2025-26 Telangana Budget)కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) అసెంబ్లీలో, మంత్రి శ్రీధర్ బాబు మండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్‌ను ప్రవేశపెట్టే ముందు నల్లపోచమ్మ గుడిలో బడ్జెట్ ప్రతులను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రవేశపెట్టిన తొలి పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపైనే ఉంది. మొత్తం బడ్జెట్ రూ.3 లక్షల కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Josh Cobb Retire: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఇంగ్లాండ్ ఆల్ రౌండర్!
కాంగ్రెస్ ప్రభుత్వం 2024లో లోక్‌సభ ఎన్నికల కారణంగా ఫిబ్రవరిలో తాత్కాలికంగా ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. తర్వాత, 2024 జులైలో మిగిలిన తొమ్మిది నెలల కోసం రూ.2.90 లక్షల కోట్లతో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. కానీ ఇప్పుడు మొత్తం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. ముఖ్యంగా 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు అధికంగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. వ్యవసాయం, నీటిపారుదల, విద్య, రోడ్లు-భవనాలు, ఇంధన శాఖలు ఈ బడ్జెట్‌లో ప్రాధాన్యత పొందనున్నాయి.
Gold Price Today : ఇక సామాన్య ప్రజలు పసిడి కొనలేరు !
రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలకు ప్రభుత్వం పెద్దపీట వేయనుంది. వ్యవసాయ రంగానికి అధికంగా నిధులు కేటాయించనున్నారు. రీజినల్ రింగు రోడ్డు, రేడియల్ రహదారుల నిర్మాణానికి రోడ్లు-భవనాల శాఖకు నిధులు అందించనున్నారు. అలాగే గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అమలు చేయడానికి ఇంధన శాఖకు ఎక్కువ నిధులు కేటాయించే అవకాశముంది. కొత్తగా ఏర్పాటు చేయనున్న “యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ పాఠశాలల” కోసం విద్యా శాఖకు భారీగా నిధులు అందించే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.