Site icon HashtagU Telugu

Free Bus Scheme : రేవంత్ అన్న..ఏంటి మాకు ఈ తిప్పలు ..బస్సు కండక్టర్ల ఆవేదన

తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ (Congress) అధికారంలోకి రావడానికి కీలక పాత్ర పోషించింది రేవంత్ రెడ్డి (CM Revanth)..ఇది ఎవర్నడిగిన ఇదే చెపుతారు..ఒక్కడే అన్ని తానై..ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు అయ్యేలా చేసాడు. అలాంటి రేవంత్ నేడు సీఎం గా బాధ్యతలు చేపట్టి..తనదైన మార్క్ కనపరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. అధికారంలోకి రాగానే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ (Free Bus scheme) సౌకర్యం కల్పించి మహిళల్లో సంతోషం నింపారు. కానీ ఈ పథకం ఇప్పుడు కండక్టర్ల (Bus Conductor) కు తిప్పలు పెడుతుంది.

We’re now on WhatsApp. Click to Join.

ఈ పథకం ప్రవేశం పెట్టిన మొదట్లో ఎలాంటి గుర్తింపు కార్డు లేకపోయినా ఫ్రీ ప్రయాణం అందజేశారు. కానీ ఇప్పుడు సదరు మహిళా తప్పని సరి గుర్థింపు కార్డు చూపించాల్సిందే అని నియమం పెట్టారు. ప్రయాణం చేసే వారు తప్పనిసరి ఏదొక గుర్తింపు కార్డు అనేది కండక్టర్ కు చూపించాల్సిందే అని..లేదంటే టికెట్ కు డబ్బులు చెల్లించలాల్సిందే అని తేల్చి చెప్పారు. దీంతో చాలామంది మహిళలు తమవెంట గుర్తింపు తీసుకొని వెళ్తున్నారు. అయితే కొంతమంది మాత్రం ఫోన్ లలో ఉన్న గుర్తింపు కార్డు చూపిస్తూ..కండక్టర్లకు తలనొప్పిగా మారుతున్నారు. కార్డు చూపించాల్సిందే అని సదర్ కండక్టర్ చెప్పిన వినకుండా..రివర్స్ లో కండక్టర్ తో గొడవకు దిగుతున్నారు. మీకు చుపించాల్సింది..కార్డే కదా..అది ఇదే అంటూ వాదిస్తున్నారు. తాజాగా బస్సు లో ఇదే జరిగింది. తోటి ప్రయాణికులు ఎంత చెప్పిన సదరు యువతీ వినకుండా కండక్టర్ తో గొడవకు దిగింది. దీంతో సదరు కండక్టర్లు సీఎం కు మోర పెట్టుకుంటున్నారు.

Read Also : Rythu Bandhu Scheme : రేషన్ కార్డు లేకుంటే రైతుబంధు కట్..?