BSP 3rd List : బీఎస్పీ మూడో జాబితా విడుదల

ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా... రెండవ జాబితాలో 43 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ఈ మూడోజాబితాలో 25 మందిని ప్రకటించింది

  • Written By:
  • Publish Date - November 4, 2023 / 07:40 PM IST

ఎన్నికల సమయం (2023 Telangana Elections) దగ్గర పడుతుండడం..నామినేషన్ల పర్వం కూడా మొదలుకావడం తో ఇంకా అభ్యర్థులను ప్రకటించని పార్టీలు పూర్తి స్థాయిలో అభ్యర్థులను ప్రకటించి..ప్రచారాన్ని ముమ్మరం చేయాలనీ చూస్తున్నాయి. అధికార పార్టీ (BRS) అందరికంటే ముందే అభ్యర్థుల ప్రకటించి ప్రచారంలో దూకుడు కనపరుస్తుంటే..ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ (Congress) దూకుడు చూపిస్తుంది. ఇక బిజెపి (BJP) సైతం మూడు జాబితాలను రిలీజ్ చేయగా..తాజాగా శనివారం బీఎస్పీ సైతం 25 మందితో కూడిన మూడో జాబితాను (BSP 3rd List) విడుదల చేసింది. హైదరాబాద్ లోని ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర చీఫ్ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ (BSP Chief RS Praveen Kumar) అభ్యర్థులను ప్రకటించారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇంతకు ముందు మొదటి జాబితాలో 20 మంది అభ్యర్థుల పేర్లను బీఎస్పీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అదే విధంగా… రెండవ జాబితాలో 43 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ క్రమంలో తాజాగా విడుదల చేసిన ఈ మూడోజాబితాలో 25 మందిని ప్రకటించింది. దీంతో బీఎస్పీ మొత్తం 88 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయ్యింది. ఇక మరో 31 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో 32 మంది ఎస్సీలకు, 33 మంది బీసీలకు, 13 మంది ఎస్టీలకు, నలుగురు జనరల్, 5 మైనార్టీలకు సీట్లను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతగా ఉన్న కొత్త మనోహర్ రెడ్డి ఇటీవల బీఎస్పీలో చేరారు. ఆయనకు మహేశ్వరం టిక్కెట్‌ను కేటాయించారు. గోషామహల్ నుంచి మహ్మద్ కైరుద్దీన్ అహ్మద్ పోటీ చేస్తున్నారు. అలాగే రాజేంద్రనగర్‌ నుంచి మొదట ప్రొ.అన్వర్ ఖాన్‌ పేరు ఖరారు చేయగా.. ఇప్పుడు ఆయనను అంబర్ పేట్‌కు మార్చారు. ఇక రాజేంద్ర నగర్‌ స్థానాన్ని రాచమల్లు జయసింహకు కేటాయించారు.

బీఎస్పీ ప్రకటించిన మూడో జాబితా అభ్యర్థులను (BSP 3rd List Candidates) చూస్తే..

  1. అంబర్ పేట్- ప్రొ. అన్వర్ ఖాన్ (మార్పు)
  2. రాజేంద్రనగర్ – రాచమల్లు జయసింహ (మార్పు)
  3. మేడ్చల్ – మల్లేపోగు విజయరాజు
  4. కుత్బుల్లాపూర్ – మహ్మద్ లమ్రా అహ్మద్
  5. కార్వాన్ – ఆలేపు అంజయ్య
  6. గోషా మహల్ – మహ్మద్ ఖైరుద్దీన్ అహ్మద్
  7. ఎల్బీ నగర్ – గువ్వ సాయి రామ కృష్ణ ముదిరాజ్
  8. మహేశ్వరం- కొత్త మనోహర్ రెడ్డి
  9. అదిలాబాద్ – ఉయక ఇందిర
  10. చెన్నూర్ (ఎస్సీ)- డా. దాసారపు శ్రీనివాస్
  11. నిజామాబాద్ (రూరల్)- మటమాల శేఖర్
  12. ఆర్మూర్- గండికోట రాజన్న
  13. బాల్కొండ- పల్లికొండ నర్సయ్య
  14. కరీంనగర్ – నల్లాల శ్రీనివాస్
  15. హుస్నాబాద్- పెద్దోళ్ల శ్రీనివాస్ యాదవ్
  16. నర్సాపూర్ – కుతాడి నర్సింహులు
  17. సంగారెడ్డి – పల్పనూరి శేఖర్
  18. నారాయణ్ ఖేడ్ – మహ్మద్ అలాఉద్దీన్ పటేల్
  19. జడ్చర్ల – శివ వుల్కుందఖర్
  20. నారాయణ్ పేట్ – బొడిగెల శ్రీనివాస్
  21. అలంపూర్ (ఎస్సీ) – మాకుల చెన్న కేశవరావు
  22. భూపాలపల్లి – గజ్జి జితేందర్ యాదవ్
  23. పరకాల – అముధాలపల్లి నరేష్ గౌడ్
  24. ఖమ్మం – అయితగాని శ్రీనివాస్ గౌడ్
  25. సత్తుపల్లి (ఎస్సీ) – సీలం వెంకటేశ్వర రావు

ఇక బీఎస్పీ మేనిఫెస్టో (BSP Menifesto 2023) చూస్తే..

యువతకు అయిదు ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాలు, రైతులకు ఉచిత వాషింగ్ మిషన్, స్మార్ట్ ఫోన్, ప్రతి కుటుంభానికి 15 లక్షల ఆరోగ్య భీమా ప్యాకేజ్, ఇళ్లు లేని వారికి 550 గజాల ఇంటి స్థలం ఇళ్లు కట్టుకునే వారికి 6 లక్షల సహాయం , కన్సీ యువ సర్కార్, బహుజన రైతు ధీమా , పూలే విద్యా దీవెన , బ్లూ జాబ్ కార్డు , దొడ్డి కొమరాయ్య భూమి హక్కు , నూరేళ్లు ఆరోగ్య ధీమా , చాకలి ఐలమ్మ మహిళా జ్యోతి , వలస కార్మికులు సంక్షేమ నిధి , భీం రక్షణ కేంద్రం , షేక్ బందగీ గృహ భరోసా వంటి పథకాలు ప్రవేశపెట్టారు.

Read Also : Viral : హిందూ ఆలయంలో మూత్రం పోసిన ముస్లిం వ్యక్తి