BSP vs BRS : టీబీఎస్పీ అధ్య‌క్షుడు ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌, ఆయ‌న కుమారుడిపై హ‌త్యాయ‌త్నం కేసు

తెలంగాణ బీఎస్పీ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌, ఆయ‌న కుమారుడిపై హ‌త్యాయ‌త్నం కేసు

  • Written By:
  • Publish Date - November 14, 2023 / 09:26 AM IST

తెలంగాణ బీఎస్పీ పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్ర‌వీణ్‌కుమార్‌, ఆయ‌న కుమారుడిపై హ‌త్యాయ‌త్నం కేసు న‌మోదైంది. ఆదివారం రాత్రి BSP, BRS కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘ‌ర్షణ‌కు సంబంధించి పోలీసులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయ‌న కుమారుడిపై కేసె న‌మోదు చేశారు. తనపై, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో పీహెచ్‌డీ స్కాలర్‌గా ఉన్న తన కుమారుడు, 11 మంది సీనియర్‌ సభ్యులపై కాగజ్‌నగర్ పోలీసులు హత్యాయత్నం కింది, ఐపీసీ 307, 395 కేసు నమోదు చేసినట్లు ప్రవీణ్ కుమార్ ట్విట్ట‌ర్ లో తెలిపారు.సిర్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి కోనేరు కోనప్ప ఆదేశాల మేరకే పోలీసులు త‌మ‌పై కేసులు పెట్టార‌ని ఆయ‌న ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రచార వాహనం డ్రైవర్‌గా ఉన్న వ్య‌క్తి ఫిర్యాదు చేశాడ‌ని.. అతని నుండి రూ. 25,000 తాను దొంగిలించానని కేసు న‌మోదు చేశార‌ని ఆర్ఎస్‌పీ తెలిపారు. 26 ఏళ్ల నిరపాయమైన సర్వీస్‌తో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారికి ఇలా జరిగితే గత రెండు దశాబ్దాలుగా సిర్పూర్‌-కాగజ్‌నగర్‌లో కోనప్ప పాలనలో దశాబ్ద కాలంగా కేసీఆర్‌ పాలనలో తెలంగాణలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారో ఒక్కసారి ఆలోచించండంటూ ట్వీట్ చేశారు.తప్పుడు ఆరోపణలకు తాను భయపడనని.. సిర్పూర్‌ను బిఆర్‌ఎస్ దుష్టపాలన నుండి విముక్తి చేసే వరకు విశ్రమించబోనని తెలిపారు.

We’re now on WhatsApp. Click to Join.

ఆదివారం రాత్రి కాగజ్‌నగర్‌లో భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్), బహుజన్ సమాజ్ పార్టీ (బిఎస్‌పి) మద్దతుదారుల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. ఆర్ ఎస్ ప్ర‌వీణ్ కుమార్ ప్రసంగిస్తున్న ఎన్నికల సమావేశానికి అధికార పార్టీ మద్దతుదారులు అంతరాయం కలిగించడంతో గొడ‌వ మొదలైంది. తాము బహిరంగ సభ నిర్వహిస్తున్న ప్రదేశానికి బీఆర్ఎస్‌ ప్రచార వాహనం పెద్ద శబ్దంతో పాటలు ఆడుతూ వచ్చిందని బీఎస్పీ నేతలు ఆరోపించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఘర్షణకు దిగిన ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు పోలీసులు రంగప్రవేశం చేయాల్సి వచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్ఎస్ ప్ర‌వీణ్‌ కుమార్ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. ఈ ఘటనకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారణమని ఆరోపించారు. సిర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్య‌ర్థిగా ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్‌ పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే.

Also Read:  3 Killed : మున్నేరు వాగులో ముగ్గురు యువకులు గల్లంతు