BRS : తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ శాసనసభాపక్షం సమావేశం ప్రారంభమైంది. పార్టీ అధినేత చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రారంభమైన ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వాటిపై తీసుకున్న చర్యలపై కేసీఆర్ పార్టీ ప్రజాప్రతినిధులకు వివరించి, అందుకు అనువైన కార్యాచరణపై దిశానిర్దేశం చేయనున్నారు.
Read Also: Test 150th Anniversary: టెస్టు క్రికెట్‌కు 150 ఏళ్లు.. ఎప్పుడంటే?
రాష్ట్రంలో వ్యవసాయరంగం, రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను సభ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ, తదితర అంశాలపై కూడా మార్గనిర్దేశం చేయనున్నారు. బుధవారం నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలతోపాటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్లపై బిల్లులు ప్రవేశపెట్టాలని ఈ నెల 6న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయించింది.
కాగా, రైతాంగ సమస్యలు, ఏపీతో నీటి పంపకాలపై సభలో కాంగ్రెస్ సర్కార్‌ను ఎండగట్టాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42శాతం రిజర్వేషన్ల అంశంపై సభలో ప్రశ్నలు లేవనెత్తుతామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరోవైపు ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరుకానున్నారు. సభకు కేసీఆర్ హాజరవుతారని మాజీ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటింగ్‌పై ఎమ్మెల్యేలకు కేసీఆర్ అవగాహన కల్పించనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారు.