KTR: అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా కేటీఆర్

KTR: అప్పుల బాధ‌తో ఆత్మ‌హ‌త్య‌ చేసుకున్న నేతన్న కుటుంబానికి అండగా నిలిచారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల నివాసి సిరిపురం లక్ష్మినారాయణ అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కేటీఆర్ సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి వెళ్లి లక్ష్మినారాయణ భౌతిక దేహానికి నివాళులర్పించి, కుటుంబీకులను పరామర్శించారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద లక్ష్మీనారాయణ కుటుంబాన్ని ఓదార్చారు. లక్ష్మినారాయణ మృతిపట్ల తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్ ఆ కుటుంబానికి తక్షణ సాయం కింద పార్టీ తరఫున 50వేల రూపాయలను అందించారు.

We’re now on WhatsAppClick to Join

ఈ సందర్భంగా కేటీఆర్ స్థానిక కలెక్టర్ కు ఫోన్ చేసి మాట్లాడారు. నేతన్న కుటుంబానికి ప్రభుత్వం తరఫున రావాల్సిన ఆర్థిక సాయం గురించి కలెక్టర్ అనురాగ్ జయంతితో మాట్లాడారు. ప్రభుత్వం తరఫున రావాల్సిన సహాయాన్ని వెంటనే అందించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నేతన్నలు ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు.

అంతకుముందు కేటీఆర్ బీఆర్ఎస్ తలపెట్టిన రైతు దీక్షలో పాల్గొన్నారు. సిరిసిల్లలో జరిగిన ఈ కార్యక్రమంలో కెటిఆర్ మాట్లాడుతూ 110 రోజుల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ సంక్షోభంలోకి నెట్టారన్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతులకు ఒక్కొక్కరికి రూ.20 లక్షలు, ఎకరాకు రూ.25 వేలు ఇవ్వాలని డిమాండ్ అలాగే వరి క్వింటాల్‌కు రూ. 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

Also Read: GV Prakash: మా ఇద్దరి మధ్య గొడవ నిజమే.. అందుకే ఆరేళ్లు మాట్లాడలేదు: జీవి ప్రకాష్