Site icon HashtagU Telugu

KTR : మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్.. ఏం చేశారంటే..

Ktr Humanity

Ktr Humanity

KTR : ఆపదలో ఉన్న ఎంతోమందిని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ గతంలో ఆదుకున్నారు. ఆపన్న హస్తాన్ని అందించారు.  మరోసారి ఆయన మానవత్వాన్ని చాటుకున్నారు. ఆక్సిడెంట్‌కు గురై రోడ్డు పక్కన పడి ఉన్న ఓ వ్యక్తిని తన ఎస్కార్ట్ కారులో ఆయన వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.

We’re now on WhatsApp. Click to Join

వరంగల్ నగరంలోని లేబర్ కాలనీ వద్ద అంజయ్య (55) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదానికి గురై కిందపడి ఉన్నాడు. ఎమ్మెల్సీ బైపోల్ ప్రచార నిమిత్తం నర్సంపేటకు వెళ్తున్న కేటీఆర్.. రోడ్డు పక్కన పడి ఉన్న వ్యక్తిని చూసి వెంటనే తన కారును ఆపారు. కాన్వాయ్‌లోని తన ఎస్కార్ట్ కారులోకి అంజయ్యను ఎక్కించి వరంగల్ ఎంజీఎంకు పంపించే ఏర్పాట్లు చేశారు. సకాలంలో స్పందించి బాధితుడిని ఆదుకున్న కేటీఆర్‌ను పలువురు ప్రశంసిస్తున్నారు.

Also Read :MLA Pinnelli : తెలంగాణ పోలీసుల అదుపులో ఎమ్మెల్యే పిన్నెల్లి డ్రైవర్.. కాసేపట్లో ఎమ్మెల్యే అరెస్ట్ ?

న‌ర్సంపేట‌లో జరిగిన  వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ – ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ప్ర‌చార స‌భ‌లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ అభ్యర్థి రాకేశ్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్రసంగిస్తూ.. ‘‘మా ప్ర‌భుత్వ హ‌యాంలో చేసిన మంచి ప‌నుల గురించి చెప్పుకోలేక.. స్వ‌ల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాం. 2 ల‌క్ష‌ల ప్ర‌భుత్వ ఉద్యోగాలు క‌ల్పించి కూడా యువ‌త‌కు దూర‌మ‌య్యాం. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు జీతాలు పెంచి కూడా వారికి దూర‌మ‌య్యాం. ఇలా చేసింది చెప్పుకోలేక ఓడిపోయాం’’ అని ఆయన తెలిపారు. ‘‘ఈ ఎన్నిక‌ల‌తో ఫ‌లితంతో ప్ర‌భుత్వం కూలిపోయేది లేదు. కానీ ప్రతీ ఓటును ఆలోచించి వేయండి.  ప్ర‌జ‌లు వాగ్దానాలు న‌మ్మి కాంగ్రెస్ పార్టీకి అవ‌కాశం ఇచ్చారు. ఇప్పుడు బాధ‌ప‌డుతున్నారు. ఇకపై అలాంటి బాధలు ఎదురు కావద్దంటే బీఆర్ఎస్‌ను ప్రతిఒక్కరు బలపర్చాలి’’ అని కేటీఆర్ కోరారు. విద్యావంతులంతా కాంగ్రెస్ పాల‌న గురించి ఆలోచించాల‌ని ఆయన పిలుపునిచ్చారు.

Also Read :Congress : తక్కువ సీట్లలో కాంగ్రెస్ ఎందుకు పోటీ చేస్తోందో చెప్పేసిన ఖర్గే

‘‘కాంగ్రెస్‌కు ఓటు వేస్తే 2 ల‌క్ష‌ల రుణ‌మాఫీ ద‌స్త్రంపై డిసెంబ‌ర్ 9న తొలి సంత‌కం చేస్తాన‌ని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అర్జంట్‌గా బ్యాంక్‌కు వెళ్లి 2 ల‌క్ష‌ల రుణం తెచ్చుకోవాల‌ని కూడా సూచించారు. డిసెంబ‌ర్ 9 పోయింది.. మ‌రో ప‌ది రోజులు అయితే జూన్ 9 వస్త‌ది. ఆరు నెల‌లు గ‌డిచిపోత‌ది. ఈ హామీపై తొలిరోజే సంత‌కం చేస్తాన‌ని మోసం చేసిన రేవంత్ రెడ్డి నిల‌బెట్టిన ఎమ్మెల్సీ అభ్య‌ర్థి ప‌ట్ల ఎలాంటి నిర్ణ‌యం తీసుకోవాలో గ్రాడ్యుయేట్లే ఆలోచించాలి’’ అని కేటీఆర్ పేర్కొన్నారు.