KTR : హైదరాబాద్ నగర డెవలప్‌మెంట్ వర్క్స్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా సంచలన పోస్ట్ పెట్టారు. ఎస్‌ఆర్‌డీపీ అంటే స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్. గత బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ వికాసం కోసం ప్రారంభించిన ఎస్‌ఆర్‌డీపీ పనులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని కేటీఆర్ మండిపడ్డారు. నగరంలో తాము 42 ప్రాజెక్టులను చేపట్టగా, 36 పూర్తి చేశామని ఆయన వెల్లడించారు. పనులు చేయకుండా మిగిలిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వంపై ఉన్నా విస్మరిస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. మంచి పనులను ఎవరు చేసినా స్వాగతించాలన్న కేటీఆర్(KTR).. హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్న కేసీఆర్ ఆలోచనలో తప్పేముందని ప్రశ్నించారు.
We’re now on WhatsApp. Click to Join
‘‘హైదరాబాద్‌లో ఎస్‌ఆర్‌డీపీ పనులు నత్తనడకన జరుగుతున్నాయి. గత 8 నెలలుగా వాటిపై ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండాపోయింది. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు’’ అని కేటీఆర్ తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఎస్‌ఆర్‌డీపీ పనులను పూర్తి చేసి, మూడో దశను ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఎస్‌ఆర్‌డీపీ మూడో దశ పనుల్లో భాగంగా మూసీకి ఇరువైపులా ఎక్స్‌ప్రెస్ వే, కేబీఆర్ పార్క్ కింద టన్నెల్స్, ఫ్లైఓవర్‌లు, అండర్‌పాస్‌లు వంటివి నిర్మించాల్సి ఉందని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌లో ట్రాఫిక్ వ్యవస్థను మెరుగుపర్చడంతో పాటు నగరాభివృద్ధికి దోహదపడే ఎస్‌ఆర్‌డీపీ పనులపై నిర్లక్ష్యం చేయొద్దని కాంగ్రెస్ సర్కారుకు ఆయన సూచించారు.
Also Read :ULI : ‘యూఎల్‌ఐ’ వస్తోంది.. లోన్ల ప్రాసెసింగ్ ఇక మరింత స్పీడ్
తెలంగాణలో డెంగీ వంటి విషజ్వరాలు వ్యాపిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఆస్పత్రుల్లో కనీసం మందులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేవన్నారు. ఈపరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలి ఆయన డిమాండ్ చేశారు. డెంగీ మరణాల సమాచారాన్ని బహిర్గతం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒకే బెడ్ పై ముగ్గురు నుంచి నలుగురికి వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉందని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలను మెరుగుపర్చాలన్నారు.