KCR : ఈ నెల 13న నల్లగొండలో బిఆర్ఎస్ భారీ బహిరంగసభ

కృష్ణా జలాల (Krishna water )పై బీఆర్ఎస్ (BRS) పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మాజీ సీఎం కేసీఆర్..మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్‌ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను ఈ సందర్భంగా కేసీఆర్‌ సమీక్షా జరిపారు. మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ […]

Published By: HashtagU Telugu Desk
Kcr Nallagonda

Kcr Nallagonda

కృష్ణా జలాల (Krishna water )పై బీఆర్ఎస్ (BRS) పార్టీ పోరుబాట పట్టింది. ఇందులో భాగంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని అధినేత కేసీఆర్ నిర్ణయించారు. మాజీ సీఎం కేసీఆర్..మూడు నెలల తర్వాత ఈరోజు తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారి కేసీఆర్‌ పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. కృష్ణా జలాల పరిరక్షణ సభ ఏర్పాట్లను ఈ సందర్భంగా కేసీఆర్‌ సమీక్షా జరిపారు.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, ఖమ్మం, నల్గొండ జిల్లాల ప్రతినిధులతో సమీక్షించి.. కృష్ణా జలాల అంశంపై నేతలకు దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్బంగా ఈ నెల 13న నల్లగొండలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. కృష్ణా జలాలు, కేఆర్ఎంబీపై వాస్తవాలు ప్రజలకు తెలపాలనే ఉద్దేశంతో ఈ సభను ఏర్పాటు చేయాలని పార్టీ శ్రేణులను ఆదేశించారు. కృష్ణా జలాల్లో రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా 2లక్షల మందితో ఈ సభ నిర్వహించాలన్నారు. కేఆర్‌ఎంబీపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాలపై ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ఉద్యమ కార్యాచరణ చేయాలనీ కేసీఆర్ సూచించారు.

We’re now on WhatsApp. Click to Join.

మరోపక్క నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఈ నెల 29 వరకు 30, 30 (A) పోలీస్ చట్టం అమల్లో ఉంటుందని ఎస్పీ చందనా దీప్తి ప్రకటన చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించకూడదని స్పష్టం చేసారు. అనుమతి లేకుండా ఎలాంటి సభలు నిర్వహించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక ఇప్పుడు 13 న బిఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని భావిస్తుంది. మరి ఈ సభకు పోలికియూ అనుమతిస్తారో లేదో చూడాలి.

Read Also : MLC Balmuri Venkat : ఓయూ లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు నిరసన సెగ

  Last Updated: 06 Feb 2024, 03:23 PM IST