Site icon HashtagU Telugu

BRS Vs Congress : 2024లో కాంగ్రెస్ సర్కారు పాలనపై ట్వీట్ల యుద్ధం

Brs Vs Congress Ktr Vs Revanth Twitter Battle Telangana Congress Govt Governance 2024

BRS Vs Congress : నూతన సంవత్సరం 2025 సమీపించిన వేళ.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య ట్వీట్ల యుద్ధంతో రాజకీయ వేడి రాచుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే లక్ష్యంగా కేటీఆర్ వరుస ట్వీట్లు చేస్తుండగా.. తెలంగాణ ప్రజల మేలు కోసం చేస్తున్న కార్యక్రమాలను సీఎం రేవంత్ సర్కారు ఏకరువు  పెడుతోంది. తాజాగా ఇవాళ (డిసెంబరు 31న) ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. ‘‘నయ వంచన, విధ్వంసం, తప్పుదోవ పట్టించడం అనే 3‘డీ’ల మేళవింపుగా 2024 సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగింది.  మేం 2025 సంవత్సరంలోనూ వెనక్కి తగ్గం.  కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన 420 హామీలను అమలు చేయమని వాళ్లను నిలదీసి తీరుతాం’’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

Also Read :Kerala Nurse Vs Yemen: యెమన్‌లో కేరళ నర్సు‌కు మరణశిక్ష.. రంగంలోకి భారత్.. ఏమిటీ కేసు ?

కేటీఆర్ చేసిన ట్వీట్‌‌కు కౌంటర్‌గా తెలంగాణ ప్రభుత్వ కమ్యూనికేషన్స్ విభాగం డైరెక్టర్ శ్రీరామ్ కర్రి ఒక ట్వీట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి మొదటి సంవత్సరం పాలనా కాలంలో సాధించిన విజయాలను ఆయన చక్కగా వివరించారు. శ్రీరామ్ కర్రి తన ట్వీట్‌లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనితీరు గురించి అద్భుతంగా చెప్పారు. ‘‘తెలంగాణలో సీఎం రేవంత్ సర్కారు తొలి ఏడాది పాలనా కాలంలో ఏం సాధించింది ? అంటే.. కొన్ని ‘ఆర్ఎస్’‌లను సాధించింది అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. అవి.. 1.వేగవంతమైన రికవరీ, 2.దృఢమైన ఎదుగుదల, 3.శాంతి, సహనాలతో  సవాళ్లను ఎదుర్కోవడం, 4.కొత్త ఉత్తేజాన్ని పొందడం, 5.గొప్పగా కోలుకోవడం’’ అని  ట్వీట్‌లో శ్రీరామ్ కర్రి(BRS Vs Congress) రాసుకొచ్చారు.  తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఏ విధమైన విజన్‌తో రేవంత్ ముందుకు సాగుతున్నారు అనేది ఈ ట్వీట్‌తో స్పష్టంగా అర్ధమవుతోంది.

Also Read :Fraud Couple : ఫ్రాడ్ కపుల్.. ప్రధాని మోడీ ముఖ్య కార్యదర్శి కూతురినంటూ మోసం

రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభపు ముప్పు నుంచి గట్టెక్కించిన ఘనుడిగా సీఎం రేవంత్ నిలిచారని చెప్పకనే చెప్పారు. గతంలో కరోనా కాలంలో తెలంగాణ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారైంది. నేడు రాష్ట్రం స్థితి మెరుగ్గా ఉండటానికి కారణం రేవంత్ నాయకత్వమే అని అందరికీ తెలుసు.  తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించినందుకు రేవంత్ వారి అంచనాలకు అనుగుణంగా పాలనను అందిస్తుండటం అభినందనీయం. సంక్షేమ పథకాల హామీల అంశాన్ని పదేపదే లేవనెత్తి ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నానికే బీఆర్ఎస్ పరిమితమైంది. సరైన సలహాలను కాంగ్రెస్ సర్కారుకు అందించి బాధ్యతాయుత ప్రతిపక్షంగా పనిచేసే ఉద్దేశం గులాబీ పార్టీలో కనిపించడం లేదు. ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వపూ పూర్తి ఫోకస్ ప్రజా సంక్షేమంపై మాత్రమే ఉండటం విశేషం.