IT Companies : తెలంగాణ కంపెనీలపై ఏపీ గురి .. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం – బిఆర్ఎస్

రేవంత్ రెడ్డి అసమర్థతను ఆసరాగా తీసుకుని తెలంగాణలోని పరిశ్రమలు, కంపెనీలను తన్నుకుపోదామని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

  • Written By:
  • Publish Date - July 2, 2024 / 12:24 PM IST

ఏపీలో కూటమి అధికారంలోకి రావడం..సీఎం గా చంద్రబాబు (Chandrababu) బాధ్యతలు చేపట్టడం తో చాలామంది అనేక రకాలుగా మాట్లాడుకుంటున్నారు. ముఖ్యంగా తెలంగాణ ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతుంది. హైదరాబాద్ లో ఐటీని డెవలప్ చేసింది..ఐటీ ని పరిచయం చేసింది చంద్రబాబు. ఇది ఎవర్ని అడిగిన చెపుతారు. చంద్రబాబు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు , ఆలోచనలు ఈరోజు హైదరాబాద్ అంటే ఐటీ కి కేరాఫ్ గా మార్చేలా చేసింది. అలాంటి చంద్రబాబు ఇప్పుడు ఏపీలో మరోసారి సీఎం కావడం..రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు తీసుకుంటున్న నిర్ణయాలు అందర్నీ ఆలోచనలో పడేస్తున్నాయి. రాష్ట్రం వదిలి పోయిన కంపెనీ లే కాదు రాష్ట్రానికి ఐటీ కంపెనీ లు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ మేరకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ (BRS) పార్టీ సోషల్ మీడియా వేదికగా ఓ కీలక పోస్ట్ చేసింది. రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అసమర్థతను ఆసరాగా తీసుకుని తెలంగాణలోని పరిశ్రమలు, కంపెనీలను తన్నుకుపోదామని చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ఇంత జరుగుతున్నా.. మొద్దు నిద్రపోతున్న కాంగ్రెస్ ప్రభుత్వం.

తెలంగాణకు శాపంలా మారిన రేవంత్ అసమర్థ పాలన..

అనుమతులొచ్చి పనులు ప్రారంభించని కంపెనీ లపై కన్నేసిన దాయాది రాష్ట్రం

విస్తరణ పేరుతో భారీ రాయితీలతో గాలం

ఐటీ కంపెనీలే ప్రధాన టార్గెట్

రేవంత్ ప్రభుత్వం ఇకనైన పాలనపై దృష్టి పెట్టకపోతే అంతే సంగతులు అంటూ పోస్ట్ చేసింది.

దీనికి కారణం కూడా ఉందని అంటున్నారు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు..సీఎం రేవంత్ రెడ్డి కి లేఖ రాసారు. ఇరు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న విభజన అంశాలను పరిష్కరించుకుందామని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇందుకు ఈ నెల 6న హైదరాబాద్‌లో సమావేశమవుదామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లయినా చాలా సమస్యలు అలాగే ఉన్నాయని… ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముఖాముఖి సమావేశాలతోనే ఇవి పరిష్కారమవుతాయని ఏపీ సీఎం ఆ లేఖలో పేర్కొన్నారు. రెండు రాష్ట్రాలు సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు.

” తెలంగాణ ముఖ్యమంత్రిగా మీరు చేస్తున్న విశేషమైన కృషికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. మీ అంకితభావం, నాయకత్వం తెలంగాణ ప్రగతికి, అభివృద్ధికి గణనీయంగా తోడ్పడుతాయి. తెలుగు మాట్లాడే రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సుస్థిరమైన పురోగతి, శ్రేయస్సు కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, పురోగతికి మన నిబద్ధత, సహకారం ఎంతో కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్లు పూర్తయ్యాయి. పునర్వ్యవస్థీకరణ చట్టం నుంచి ఉత్పన్నమయ్యే సమస్యల గురించి అనేక చ

దీనికి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. దీని బట్టి చూస్తే ఈ నెల 6 న ఇరు సీఎంలు సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. మరి బిఆర్ఎస్ ఆరోపిస్తున్నట్లు ఐటీ కంపెనీ లు ఆంధ్రకు తరలిపోతాయా..? ఆలా తరలిపోతుంటే సీఎం రేవంత్ చూస్తూ ఉంటాడా..? చూడాలి మరి ఏంజరుగుతుందో..!!