తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు (Telangana MLC Elections) రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. బీఆర్ఎస్ (BRS) ఈ ఎన్నికలకు దూరంగా ఉండటంతో ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్య నెలకొంది. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు జరగనున్న ఈ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ తమదైన వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఎన్నికలు కీలక మలుపుగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటికే బీజేపీ ఢిల్లీ ఎన్నికల విజయంతో ఉత్తేజంగా ఉంది. అయితే, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. గతంలో బీఆర్ఎస్, బీజేపీ (BRS support BJP) మధ్య పరోక్ష ఒప్పందం జరిగిందన్న ప్రచారం కొనసాగుతున్న వేళ, ఇప్పుడు బీఆర్ఎస్ పోటీ చేయకపోవడం బీజేపీకి లబ్ధి చేకూర్చేలా ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఫామ్ హౌస్ ఎపిసోడ్, లిక్కర్ స్కామ్ వంటి వివాదాల నేపథ్యంలో బీఆర్ఎస్ పరోక్షంగా బీజేపీకి మద్దతు ఇస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Ex-Goa MLA : ఆటో డ్రైవర్ చేతిలో మాజీ ఎమ్మెల్యే మృతి
బీజేపీ ప్రస్తుతం ఎస్సీ, బీసీ నేతలను ముందు పెట్టి రాష్ట్రంలో తన పట్టును బలపర్చాలని చూస్తోంది. రాజ్యసభ సభ్యుడిగా ఆర్. కృష్ణయ్యను ఎంపిక చేయడం, మందకృష్ణ మాదిగకు పద్మ అవార్డు ఇవ్వడం ఈ వ్యూహంలో భాగంగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీఆర్ఎస్-బీజేపీ మధ్య ఒక రహస్య ఒప్పందం ఉండొచ్చని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుండా బీఆర్ఎస్ తన మద్దతును బీజేపీకి అందించవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ గత పాలనలో పట్టభద్రుల సమస్యలను పట్టించుకోకపోవడం, ఉపాధ్యాయ సమస్యలపై కూడా నిర్లక్ష్య ధోరణి అవలంబించడం ప్రజల్లో వ్యతిరేకతను పెంచిందని విశ్లేషకులు చెప్తున్నారు. దీంతో, బీఆర్ఎస్ బీజేపీకి మద్దతుగా వ్యవహరించడం ప్రజల్లో ప్రతికూలత కలిగించే అవకాశం ఉంది