BRS Meeting : ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభపై ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఈ సభా వేదికపై కేవలం ఇద్దరు అగ్ర నేతల ఫొటోలే కనిపించాయి. ఓ వైపు కేసీఆర్.. మరోవైపు కేటీఆర్ ఫొటోలను సభా వేదికపై ప్రదర్శించారు. పార్టీ అగ్ర నాయకురాలు కవిత ఫొటోను వేదికపై ప్రదర్శించలేదు. గతంలో జరిగిన బీఆర్ఎస్ సభలను పరిశీలిస్తే.. సభా వేదికపై కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో పాటు ఇతర నేతల ఫొటోను చిన్నగానైనా ఫ్లెక్సీపై ప్రదర్శించారు. కానీ ఈసారి అందుకు భిన్నంగా జరిగింది.
Also Read :PM Modi : ప్రధాని మోడీ అమరావతి పర్యటన షెడ్యూల్ ఖరారు
కేటీఆర్‌ను ప్రమోట్ చేసేలా..
కేసీఆర్ రాజకీయ వారసుడిగా కేటీఆర్‌ను ప్రమోట్ చేసేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ జరిగిందని పలువురు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా.. బీఆర్ఎస్ కల్చరల్ టీమ్ సభా వేదికపై కేటీఆర్, కేసీఆర్‌లను మాత్రమే స్తుతించింది. వారిద్దరి గురించి మాత్రమే గొప్పగా ప్రస్తావించింది. కల్వకుంట్ల కవిత ప్రస్తావన రాలేదు. అంతేకాదు ఈ అంశంపై స్టేజీపైనే రాద్ధాంతం కూడా జరిగింది. సభకు హాజరయ్యేందుకు కవిత చేరుకోగానే.. ఆమె కోసం ఒక ఎంట్రీ సాంగ్ పాడాలని ఓ సింగర్‌కు నిర్వాహకులు చెప్పారు. దీంతో సదరు సింగర్ వేదికపైకి వచ్చి పాట పాడుతుండగా, బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకృష్ణ ఆవేశపడ్డారు. బౌన్సర్లను పిలిపించి ఆ సింగర్‌ను స్టేజీ పైనుంచి కిందికి దింపారు.
Also Read :Rajamouli: నేను తీయబోయే మహాభారతంలో నాని ఫిక్స్: రాజమౌళి
కవితకు క్లారిటీ ఇచ్చేందుకేనా ?
అనంతరం కేటీఆర్‌ను(BRS Meeting) స్తుతిస్తూ కల్చరల్ ప్రోగ్రామ్స్ కొనసాగాయి. దీన్ని చూసిన బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఉద్దేశపూర్వకంగానే బీఆర్ఎస్ పార్టీలో కవితకు ప్రయారిటీని తగ్గిస్తున్నారా ? ఈవిషయంపై కవితకు క్లారిటీ ఇచ్చేందుకే బీఆర్ఎస్ రజతోత్సవ సభను కేటీఆర్ వాడుకున్నారా ? తన రాజకీయ వారసుడు కేటీఆరే అని కేసీఆర్ స్పష్టత ఇచ్చేశారా ? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉదయిస్తున్నాయి. ఇప్పుడు వెంటనే కాకున్నా.. రాబోయే కాలంలో తప్పకుండా ఈ ప్రశ్నలకు సమాధానాలు లభించే అవకాశం ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్ రజతోత్సవ సభ తర్వాత కవిత తన భవిష్యత్తు రాజకీయ కార్యాచరణపై ఫోకస్ పెట్టే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.